పవన్ కళ్యాణ ట్రెండ్ సెట్ చేస్తూ.. పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్..!

Jana Sena మార్క్ వైపు Deputy CM Pawan అడుగులు వేస్తున్నారు. జనసేన తీసుకునే శాఖలపై ప్రజల సూచనలు, సలహాల కోసం క్యూఆర్ కోడ్ విడుదలైంది. Deputy CM Pawan kalyan గూగుల్ ఫారమ్ ద్వారా సూచనలు, సలహాలు కోరుతున్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర సరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీకి సంబంధించి ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకుంటే, వారు క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫారమ్‌ను నింపడానికి ఏర్పాట్లు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Janasena leader Pawan Kalyan  ఉప ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, Science and Technology శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖల మంత్రిగా కందుల దుర్గేష్.

అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం అధికారులను సమీక్షలతో పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్.. ఎక్కడికక్కడ జనతా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. జనసేన కార్యాలయంలో బాధితుల సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అవసరమైతే జనసేన అధినేత స్వయంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పాలనను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జనసేన టెక్నాలజీ సాయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి సూచనలు, సలహాలు పంపాలని జనసేనాని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రజలకు official social media platform X ద్వారా తెలియజేసింది.జనసేన.. QR code  Scan చేసి లేదా లింక్ ద్వారా గూగుల్ ఫారమ్ నింపాలని తెలిపింది. ఈ మేరకు QR code , లింక్‌లను ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

జనసేన పార్టీ ప్రకటనకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకొన్ని అంశాలు చేర్చడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *