PAPAYA: బొప్పాయి పండు వీరికి విషం లాంటిది..!!

అన్ని సీజన్లలో లభించే పండు బొప్పాయి. ఇందులో డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికమోతాదులో ఉంటాయి. ఈ పండు రెగ్యులర్ గా తినేవారిలో గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. వెయిట్ మేనేజ్ మెంట్ కు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయి తింటే కొందరికి అస్సలు పడదు. దీనివల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి వారు ఈ పండు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రెగ్నెన్సీలో ఉన్న వారు హెల్తీ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే తల్లి కాబోయేవాళ్లు మాత్రం బొప్పాయిని తినకూడదు. దీంట్లో లాటెక్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యుటిరైన్ కాంట్రాక్షన్స్ కు కారణమైన అబార్షన్స్ కు లేదా నెలలు నిండక ముందే డెలివరీకి దారితీసే ప్రమాదం ఉంటుంది. అలాగే బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ అబార్షన్ కు కారణమయ్యే అవకాశం ఉంది.

గుండె ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నవారికి మాత్రం ఇది అంత మంచిదికాదు. దీంట్లో సయానోజెనిక్ గ్లైకోసైడ్స్ అనే అమైనో యాసిడ్ కొద్ది మొత్తంలో ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ లో హైడ్రోజన్ సైనైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదొక లిమిట్ వరకు ఎలాంటి హాని చేయదు. కానీ అతి అయితే మాత్రం ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ ప్రాబ్లమ్స్ ను మరింత పెంచే ప్రమాదం ఉంది. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నవాళ్లు కూడా ఇలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎదుర్కునే ఛాన్స్ ఉంటుంది.

Related News

లాటెక్స్ కు అలర్జీ ఉన్నవాళ్లు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులో చిటినాసెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి లాటెక్స్ ప్రొటీన్స్ తో క్రాస్ రియాక్షన్ జరిపి దుష్ప్రభావాలకు దారితీస్తాయి. తుమ్ములు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి బొప్పాయి వాసన కూడా అస్సలు పడదు.

బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారిలో విటమిన్ సి ఎక్కువైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బొప్పాయి తింటే కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఏర్పడటంతోపాటు వాటి సైజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

బొప్పాయి పోషకాలతో నిండిన పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని హెల్తీ డైట్ ప్లాన్ లో భాగం చేసుకోవడం చాలా మంచిది. కానీ ఇది అందరికీ సెట్ కాదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా డైట్లో మార్పులు చేసుకునే ముందు డాక్టరును సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.