నగర ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ శనివారం ప్రకటించింది. ప్రయాణికులు, కండక్టర్ల మధ్య చిన్న చిన్న వివాదాలకు ముగింపు పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఇక నుంచి యూపీఐ చెల్లింపుల ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఛార్జీల సేకరణ వ్యవస్థలో భాగంగా ఆన్‌లైన్ టికెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు.
HYD: సిటీ బస్సులో ఆన్లైన్ టికెట్ విధానం

02
Mar