Chinese smartphone giant OnePlus భారత మార్కెట్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. OnePlus Nord CE 4 Lite పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ సోమవారం సాయంత్రం విడుదలైంది. మొదటి సేల్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, 8 GB RAM మరియు 128 GB storage variant ధర రూ. 19,999 మరియు 8 GB RAM, 256 GB storage variant ధర రూ. 22,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఏమైనా తగ్గింపులు ఉంటాయో లేదో చూడాలి.
OnePlus Nord CE4 Lite 6.67-అంగుళాల AMO LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 1080p రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2100 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.
ఇందులో, 5,500 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ 80 వాట్ల ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 5 వాట్ల రివర్స్ ఛార్జింగ్ (power back) సపోర్ట్‌తో అందించబడింది. ఇది ప్రకాశవంతమైన AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
Camera విషయానికి వస్తే, ఈ Smartphone లో optical image stabilization (OIS) వెనుక కెమెరాతో 50-మెగాపిక్సెల్ Sony LVT 600 ప్రధాన సెన్సార్ ఉంది. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 వెర్షన్‌తో పనిచేసే ఈ ఫోన్ సూపర్ సిల్వర్, మెగా బ్లూ, అల్ట్రా ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి వస్తోంది.