OnePlus 13T: ఫుల్ స్పెక్స్ లీక్.. బరువు 185 గ్రాములే…

OnePlus అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఫోన్ OnePlus 13T సమాచారం తాజాగా లీక్ అయింది. ఇంకా అధికారికంగా ఫోన్ లాంచ్ అవ్వకముందే దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Weibo, X (Twitter) వేదికగా లీకైన వివరాలు చూస్తే ఇది నిజంగా ఓ బీస్ట్ లాంటి ఫోన్ అని చెప్పొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చైనా మార్కెట్‌లో ముందుగా ఈ ఫోన్ లాంచ్ కానుందని టాక్ ఉంది. ఇండియా సహా గ్లోబల్ మార్కెట్లలో కూడా ఇది త్వరలోనే అడుగుపెట్టే అవకాశం ఉంది. OnePlus ఇప్పటివరకు కొన్ని చిన్న హింట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్న లీక్స్ ఆధారంగా దీని డీటెయిల్స్ పూర్తిగా తెలిసిపోయాయి.

ఫ్లాగ్‌షిప్ లెవెల్ ప్రాసెసర్, కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ

OnePlus 13T ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన బలమైన చిప్‌సెట్స్‌లో ఒకటి. ఇందులో LPDDR5x RAM మరియు UFS 4.0 స్టోరేజ్ వర్షన్ ఉండబోతుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్‌గా Android 15 ఉంటుంది. చైనాలో ఇది ColorOS 15 బేస్‌పై రన్ అవుతుంది.

Related News

డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇది 1.5K LTPO OLED డిస్‌ప్లే. ఇది ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుంది. స్క్రీన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే స్క్రోలింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని హెచ్‌బీఎం బ్రైట్నెస్ 1600 నిట్స్ వరకు ఉంటుందంటే దాదాపు ఏకంగా సన్‌లైట్‌లో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది.

డ్యూయల్ కెమెరా సెటప్ – సోనీ + శామ్‌సంగ్ పవర్ కాంబో

కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. OnePlus 13T ఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు ఉంటాయి. ప్రధాన కెమెరా 50MP Sony LYT-700 సెన్సార్‌తో వస్తుంది. ఇందులో OIS (ఓప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉంటుంది. రెండో కెమెరా 50MP Samsung JN5 టెలిఫోటో లెన్స్.

ఫ్రంట్ కెమెరా 32MP ఉంటుంది. సెల్ఫీలు తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ కెమెరాలను ప్రొఫెషనల్ లెవెల్‌గా హస్సెల్‌బ్లాడ్ ట్యూన్ చేస్తోంది. అంటే ఫోటోలు మరింత న్యాచురల్‌గా, డీటెయిల్డ్‌గా వస్తాయి.

బ్యాటరీ కెపాసిటీ – చిన్న ఫోన్‌లో భారీ పవర్

ఈ ఫోన్ బరువు కేవలం 185 గ్రాములే. కానీ దీంట్లో 6,100mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు OnePlus ఇచ్చిన పెద్ద బ్యాటరీగా చెప్పొచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీని స్పెషల్ ఫీచర్. అంటే చార్జింగ్ టైమ్ తక్కువ – యూజ్ టైమ్ ఎక్కువ.

ఇతర అదనపు ఫీచర్లు కూడా మిస్ చేయొద్దు

ఫోన్‌లో Wi-Fi 7, Bluetooth 5.4 కనెక్టివిటీ ఉంటుంది. స్పీకర్స్ కూడా డ్యూయల్ స్టీరియో వస్తాయి. స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మునుపటి OnePlus ఫోన్లలో ఉన్న అలర్ట్ స్లైడర్ స్థానంలో ఇప్పుడు కొత్తగా ‘ఆక్షన్ బటన్’ వస్తోంది. ఇది iPhone లాంటి ఫీచర్ అని చెప్పొచ్చు.

ఇంకొక శక్తివంతమైన విషయం ఏంటంటే… ఈ ఫోన్‌కి IP68 మరియు IP69 రేటింగ్ లభించింది. అంటే నీరు, ధూళి బాగా తట్టుకోగలదు. చాలా ఫోన్లకు IP68 మాత్రమే ఉండగా… ఇది రెండు రేటింగ్స్‌తో వస్తోంది.

లాంచ్ డేట్ ఇంకా..

OnePlus 13T ఫోన్ విడుదలకు ఇంకా కంపెనీ స్పష్టమైన తేదీ వెల్లడించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇది వచ్చే రెండు వారాల్లో చైనా మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో మాత్రం మే లేదా జూన్‌లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చు.

ఫైనల్ టాక్ – OnePlus ఫ్యాన్స్ మిస్ కావద్దు

ఇందాక చెప్పుకున్న ఫీచర్లు చూస్తే, OnePlus 13T అనేది నిజంగా ఒక మినీ మాన్స్టర్ అని చెప్పొచ్చు. పవర్‌ఫుల్ ప్రాసెసర్, బ్రిలియంట్ డిస్‌ప్లే, ప్రొఫెషనల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ – ఇవన్నీ కలిపి ఇది ఫ్యాన్స్‌కి ఓ సూపర్ ఆఫర్ లాంటి ఫోన్.

ఇక పాత ఫోన్లతో అసహనంగా ఉన్నవారు, కొత్త ఫోన్ కొనాలనుకునే వారు… ఫోటోగ్రఫీ, గేమింగ్, డే టు డే యూజ్ కోసమైతే OnePlus 13T రాక కోసం కాసేపు వేచి ఉండండి. ఒకసారి లాంచ్ అయితే వెంటనే లభించకపోవచ్చు. ఈ ఫోన్ అసలు మిస్ అవ్వకండి.