దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఒక ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని నేషనల్ కౌన్సిలర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్ సిటిఈ పాలకమండలి సమావేశంలో చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. ఒక ఏడాది బీఈడీ కోర్సు సహా ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో ఒక కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. బీఈడీ కోర్స్ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ లేదా రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులకు వర్తించనుంది. మూడేళ్ల డిగ్రీ చేసిన వారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాదు. అయితే, పాఠశాలలో విద్య నాణ్యత ప్రమాణాలు పెంచాలన్నలక్ష్యంతో 2014 ఏడాది డిసెంబర్ లో కేంద్రం బిఈడి కోర్సు ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మళ్లీ తెరపైకి ఒక ఏడాది బీఈడీ కోర్స్!
22
Jan