పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగిగా నటించి భారీ మోసం. డిజిటల్ కాలంలో ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న రాజేష్ కుమార్ అనే వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. PNB (Punjab National Bank) ఉద్యోగిగా నటించిన వ్యక్తి అతనితో WhatsApp వీడియో కాల్ చేసి, అతని క్రెడిట్ కార్డులన్నీ చూపించాలని కోరాడు.
ఈ మధ్య కాలంలో ఇలా బ్యాంకు ఉద్యోగిగా నటించి మోసాలు చేయడం పెరుగుతోంది. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండకపోతే, ఒక్క నిమిషంలో లక్షలు కోల్పోవాల్సి వస్తుంది.
ఎలా మోసానికి గురయ్యారు?
- డిసెంబర్ 23, 2024 రోజున రాజేష్‌కి PNB ఉద్యోగిగా ఓ వ్యక్తి కాల్ చేశాడు
- అతనికి WhatsApp వీడియో కాల్ చేసి అన్ని క్రెడిట్ కార్డులను చూపించమని అడిగాడు
- తర్వాత ఒక లింక్ పంపించి దాన్ని ఓపెన్ చేయమని కోరాడు
- రాజేష్ ఆ లింక్‌ను ఓపెన్ చేసిన క్షణమే అతని కార్డుల నుంచి మొత్తం ₹8.69 లక్షలు గోల్‌మాల్
- American Express కార్డ్ నుంచి ₹8,69,400 మరియు Axis Bank కార్డ్ నుంచి ₹60,000 దొంగిలించబడ్డాయి
రాజేష్ వెంటనే బ్యాంక్‌కి ఫిర్యాదు చేయడంతో అతని కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి, కానీ అప్పటికే అతను లక్షలు కోల్పోయాడు.
ఇలాంటి మోసాల నుండి ఎలా తప్పించుకోవాలి?
- ఎప్పుడూ మీ క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దు
- బ్యాంక్ ఉద్యోగులు ఎప్పుడూ CVV, PIN, OTP గురించి అడగరు
- అపరిచిత లింక్స్‌పై క్లిక్ చేయకండి
- మీ బ్యాంకు అకౌంట్ లేదా కార్డ్ సమాచారం ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్‌డేట్ చేయాలి
- అటు ఇటు అనుమానాస్పద ఫోన్ కాల్స్‌కు స్పందించకండి
- మీ కార్డ్ వివరాలు చెప్పాలని, QR కోడ్ స్కాన్ చేయాలని కోరితే సంపూర్ణంగా నిరాకరించండి
- వర్చువల్ క్రెడిట్ కార్డులను వాడండి
- కొన్ని బ్యాంకులు ఒక్క సారి మాత్రమే ఉపయోగించగలిగే వర్చువల్ కార్డులను ఇస్తాయి, ఇవి మోసాలకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తాయి
- దొంగిలింపును నివారించేందుకు రెండు దశల భద్రత (2FA)ను అందుబాటులో ఉంచుకోండి
- మీ బిల్లులు, లావాదేవీలు జరిగాక ఇన్‌స్టంట్ నోటిఫికేషన్‌లు రావాలంటే SMS/ఇమెయిల్ అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోండి
ఇవీ పాటిస్తే.. మోసగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయలేరు
ఇలాంటి మోసాలు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తున్నాయి. రాజేష్ కుమార్‌లాగే మనం కూడా అనుకోకుండా మోసపోకుండా ఉండాలంటే, ఫోన్ కాల్స్, WhatsApp మెసేజ్‌లు, లింక్‌లు అన్నీ డబుల్ చెక్ చేసుకోవాలి.
మీరు కూడా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని క్షణాల్లో కోల్పోతారు.