Numerology: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో నరకమే.. ముద్దు ముచ్చట్లు అస్సలు ఉండవు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన పురుషులతో డేటింగ్ కష్టమట!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నేటి ఆధునిక ప్రపంచంలో సంబంధాలను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. దీంతో తమ భాగస్వామి ఎలాంటి వ్యక్తి? జీవితాంతం తనతో ఉంటారా? వంటి విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇందుకోసం సంఖ్యాశాస్త్రాన్ని (Numerology) ఆశ్రయిస్తున్నారు.

మనిషిపై వివిధ సంఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం. ఒక వ్యక్తి లక్షణాలు, వారి ప్రవర్తన, కెరీర్, ప్రేమ, సంబంధాలు ఇలా అన్ని విషయాలను వారికి వర్తించే సంఖ్యల ఆధారంగా అంచనా వేయవచ్చు. ప్రతి విషయానికి వ్యక్తి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన పురుషులతో మహిళలు డేటింగ్ చేయడం కష్టమని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

ఏ తేదీల్లో పుట్టిన పురుషులు డేటింగ్‌కు అనుకూలం కాదు?

ఏ నెలలోనైనా 4, 8, 13, 18, 22, 27, 31 తేదీల్లో పుట్టిన పురుషులకు ప్రేమ, శృంగారంపై అంతగా ఆసక్తి ఉండదట. మహిళలు వీరితో డేటింగ్ చేస్తే సమయం వృధా తప్ప మరేమీ ఉండదు. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. వీరు చాలా ఆచరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, తమపైనే దృష్టి సారిస్తారు. శృంగార సంబంధాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. వీరి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతులు, ఇతర డేటింగ్ అవసరాలు, కనీస విషయాలు కూడా ఆశించవద్దు.

వీరిలో రొమాన్స్ తక్కువ

కొవ్వొత్తుల వెలుగులో విందులు, ఆశ్చర్యకరమైన బహుమతులు, ప్రణాళిక లేకుండా విహారయాత్రలు.. ఇలాంటివి ఆశించేవారు పైన తెలిపిన తేదీల్లో పుట్టినవారిని భాగస్వాములుగా ఎంచుకోవద్దని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు భావోద్వేగాల కంటే ఆచరణాత్మకత, తర్కానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో భాగస్వాములు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావించే అవకాశం ఉంది. అంత మాత్రాన వారికి ప్రేమ ఉండదని కాదు.. దానిని మరో రూపంలో వ్యక్తీకరిస్తారు.

నమ్మకస్తులు

ఈ తేదీల్లో పుట్టినవారు శృంగారభరితంగా ఉండకపోవచ్చు. కానీ, వీరు చాలా నమ్మకస్తులు. వీరిపై పూర్తిగా ఆధారపడవచ్చు. రాహు గ్రహ ప్రభావమే అందుకు కారణం అని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. నమ్మినవారికి చాలా మద్దతు ఇస్తారు. ప్రేమ లేఖలు రాయడం, ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేయకపోవచ్చు కానీ, అవసరమైనప్పుడు మాత్రం వెంటే ఉంటారు. సంబంధంలో ఆశ్చర్యాల కంటే స్థిరత్వం కావాలని కోరుకునేవారికి వీరు సరైన జోడి.

వీరి ప్రేమ వ్యక్తీకరణ భిన్నంగా ఉంటుంది

ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రేమను వ్యక్తీకరిస్తారు. పైన తెలిపిన తేదీల్లో జన్మించినవారి విషయంలో మాటల కంటే చేతల్లోనే అది బలంగా కనిపిస్తుంది. వారు శృంగారభరితంగా తమ ప్రేమను వ్యక్తపరచకపోవచ్చు. కానీ, తమ విశ్వాసం, కష్టాల్లో అండగా ఉండటం వంటి చర్యల ద్వారా వీరు తమ ప్రేమను చాటుతారు.

ఇలాంటివారు భాగస్వాములుగా దొరికినప్పుడు.. అందరిలా శృంగార వ్యక్తీకరణలను ఆశించకుండా తార్కికంగా, ఆచరణాత్మకంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎప్పుడూ భాగస్వామి తనతోనే ఉండాలి, తన గురించే ఆలోచించాలి, ఆశ్చర్యకరమైన బహుమతులు ఇచ్చి సంతోషపెట్టాలి అనుకునేవారు మాత్రం ఈ తేదీల్లో పుట్టినవారికి దూరంగా ఉండటం మంచిది.

ముఖ్య గమనిక:సంఖ్యాశాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడిన శాస్త్రం. ఇందులో చెప్పబడిన అంశాలు పూర్తిగా నమ్మదగినవి కాకపోవచ్చు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.