₹5 లక్షల పెట్టుబడికి ఏది బెస్ట్? NSC vs FD.. భారీ లాభాలు, తక్కువ టాక్స్ ఉన్నది ఏది?

పన్ను తగ్గించుకోవడానికి ఏది మంచిది? NSCనా? FDనా? ఎక్కువ మంది పన్ను తగ్గించుకోవడానికి National Savings Certificate (NSC) మరియు Bank Fixed Deposit (FD) ఎంచుకుంటారు.

ఇవి భద్రతతో పాటు, సంచిత రాబడులు మరియు 80C కింద భారీ టాక్స్ మినహాయింపు అందిస్తాయి. కానీ 5 ఏళ్లు లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. అయితే, ఎదులో ఎక్కువ లాభం? ఏది పెట్టుబడి పెట్టడానికి బెస్ట్?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. National Savings Certificate (NSC) – భద్రతతో కూడిన పెట్టుబడి

  •  భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన స్కీమ్ – పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.
  •  5 ఏళ్ల వరకు డబ్బు బంధించాల్సి ఉంటుంది.
  •  7.7% వార్షిక వడ్డీ రేటు (జనవరి – మార్చి 2025).
  •  TDS మినహాయింపు – NSC లో పెట్టుబడి పెడితే, వడ్డీపై TDS ఉండదు.
  •  80C కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  •  వడ్డీ రాబడి మొత్తం సెకండ్ ఇన్‌కమ్‌గా లెక్కిస్తారు, కానీ మూడేళ్ల తర్వాత టాక్స్ మినహాయింపు ఉండదు.

2. FD (Fixed Deposit) – స్థిరమైన రాబడితో కూడిన పెట్టుబడి

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు (2025):

  • SBI, PNB → 6.5%
  • HDFC, ICICI → 7%
  • IndusInd, Yes Bank → 7.25%
  • DCB Bank → 8%
  • Utkarsh Bank → 7.50%

FDపై లాభాలు 

  1.  FD లో 5 ఏళ్ల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది.
  2.  TDS వర్తిస్తుంది → రూ.40,000 (సాధారణ వ్యక్తి), రూ.50,000 (సీనియర్ సిటిజన్) పైగా వడ్డీ వస్తే TDS కట్ అవుతుంది.
  3.  DICGC ద్వారా రూ.5 లక్షల వరకు భద్రత కలదు.

NSC vs FD – ఏది బెస్ట్?

  •  రాబడి ఎక్కువ కావాలంటే – NSC (7.7%).
  •  పన్ను మినహాయింపు ఎక్కువ కావాలంటే – NSC (TDS ఉండదు).
  •  సురక్షిత పెట్టుబడి కావాలంటే – NSC (ప్రభుత్వ హామీ).
  •  కాస్త ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కావాలంటే – FD (వివిధ బ్యాంకుల్లో FD చేసుకోవచ్చు).
  •  పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఎక్కువ వడ్డీ పొందాలనుకుంటే – DCB Bank FD (8%) బెటర్.

ఫైనల్ వెర్డిక్ట్ – మీకు ఏది సరిగ్గా సరిపోతుందో నిర్ణయించుకోండి

  •  భద్రత, టాక్స్ మినహాయింపు ముఖ్యం అయితే → NSC
  •  బ్యాంక్ హామీతో అధిక వడ్డీ కావాలంటే → FD
  • పెట్టుబడి పెట్టే ముందు, మీ ఆర్థిక పరిస్థితిని, లిక్విడిటీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి