మన దేశంలో రేషన్ కార్డు అంటే కేవలం ఉచితంగా లేదా తక్కువ ధరకు నిత్యావసరాలు పొందడానికే కాదు. ఇది మన గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. పలు ప్రభుత్వ పథకాలలో, ఆధార్ లింకింగ్, రేషన్ పంపిణీ, స్కాలర్షిప్ లు, లేదా ఇళ్లకు సంబంధించిన పథకాల్లో రేషన్ కార్డు తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆధారంగా తీసుకుని అనేక సబ్సిడీలు అందిస్తున్నాయి.
ఇప్పుడు ఇంటి నుంచే చెక్ చేయొచ్చు
మీరు ఇటీవలే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఉంటే, మీ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇంటి నుంచే సులభంగా చూసేయొచ్చు. ఈ డిజిటల్ యుగంలో ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో ఆన్‌లైన్‌లోనే స్టేటస్ తెలుసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేయాలంటే ఇదే పద్ధతి
మొదట మీరు “నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్” వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్. అక్కడ “Citizen” అనే ఎంపికపై క్లిక్ చేయాలి. దానిలో “Know your Ration Card Status” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి “Search” బటన్‌పై క్లిక్ చేయండి. ఇక చివరగా CAPTCHA కోడ్ ఎంటర్ చేసి “Get RC Details” క్లిక్ చేస్తే, మీ రేషన్ కార్డు స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Related News
ప్రత్యేక రాష్ట్ర వెబ్‌సైట్లలో స్టేటస్ ఎలా చూడాలి?
ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్ ఉంటుంది. మీ రాష్ట్రానికి సంబంధించిన “Food, Civil Supplies and Consumer Affairs” వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ “Ration Card Status” అనే లింక్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఇచ్చిన అప్లికేషన్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ రేషన్ స్టేటస్ స్క్రీన్ మీద చూపిస్తారు.
ఆఫ్లైన్ లో కూడా తెలుసుకోవచ్చు
మీకు ఆన్‌లైన్ యాక్సెస్ లేకపోతే కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీ స్థానిక ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. వీటిలో రాష్ట్ర ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్, కామన్ సర్వీస్ సెంటర్ (CSC), ఈ-సేవా కేంద్రాలు ఉండొచ్చు. అక్కడ మీ అప్లికేషన్ వివరాలు చెప్పగానే వారు మీకు స్టేటస్ చెబుతారు.
తప్పులుంటే సరిచేసుకోవచ్చు
మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని వివరాలు తప్పుగా నమోదు అవుతుంటాయి. ఉదాహరణకి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు వంటివి. ఇవి తప్పుగా నమోదైతే, అదే పోర్టల్‌లో దిద్దుబాటు చేసుకునే అవకాశమూ ఉంటుంది. దీని వల్ల మీ రేషన్ కార్డు పొందడంలో వచ్చే ఆలస్యం తగ్గుతుంది.
ఎందుకు వెంటనే చెక్ చేయాలి?
మీ రేషన్ కార్డు సిద్ధంగా ఉండి మీరు తిసుకోకపోతే, తక్కువ ధరకు నిత్యావసరాలు, పెన్షన్, గృహ నిర్మాణ పథకాలు వంటి అవకాశాలను మీరు కోల్పోతారు. మరీ ముఖ్యంగా మీ పేరు “లబ్ధిదారుల జాబితాలో” లేకపోతే, దాన్ని వెంటనే సరిచేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. పైగా ప్రభుత్వం తరచూ రేషన్ కార్డుదారుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తుంది. అందుకే రేషన్ కార్డు స్టేటస్ మీరు తరచూ చూస్తూ ఉంచాలి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వెంటనే మీ స్టేటస్ చెక్ చేయండి. ఇప్పటికే చాలా మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మీది కూడా వచ్చి ఉండవచ్చు. ఆలస్యం చేస్తే కొన్ని పథకాల అవకాశాలు మిస్ కావొచ్చు. అందుకే మీ ఫోన్‌లోనే వెళ్లి ఇప్పుడే చెక్ చేయండి. మీ కుటుంబానికి ఉపయోగపడే ఈ అవకాశాన్ని చేజారనివ్వకండి.