త్వరలో 48 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

వుద్యోగం కోసం చూస్తున్న వారికి పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 48వేల గ్రామీణ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు జనవరి 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్టల్ శాఖ సంవత్సరానికి రెండుసార్లు ఖాళీలను భర్తీ చేస్తుంది. గత సంవత్సరం జూలైలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయని ఖాళీలతో పాటు మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తారు.

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.

Related News

వయసు :అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయో పరిమితి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

సెలక్షన్ ప్రాసెస్ : పదో తరగతిలో పొందిన మార్కులు (గ్రేడ్) మరియు రిజర్వేషన్ నియమం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు : SC, ST, దివ్యాంగులు మరియు మహిళలకు పరీక్ష రుసుము లేదు. ఇతర అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి.

నోటిఫికేషన్ సమయం : నోటిఫికేషన్‌లో రాష్ట్ర వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పోస్టల్ శాఖ త్వరలో జనవరి 29 న ప్రకటిస్తుంది.