UPI ట్రాన్సాక్షన్స్ – లెక్కల మోత
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించిన సమాచారం ప్రకారం, మార్చి 2025లో UPI ద్వారా 18.3 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇది ఫిబ్రవరిలో నమోదైన 16.11 బిలియన్ కంటే 13.59% పెరుగుదల. మొత్తం UPI ట్రాన్సాక్షన్స్ విలువ ₹24.77 లక్షల కోట్లు దాటింది. ఇది ఫిబ్రవరిలో నమోదైన ₹21.96 లక్షల కోట్లతో పోలిస్తే 12.79% ఎక్కువ.
UPI గిరాకీ పెరిగింది – నూతన మార్గదర్శకాలు వచ్చాయి
మార్చిలో రోజుకు సగటున ₹79,910 కోట్ల విలువైన UPI లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో, UPI ద్వారా లావాదేవీల సంఖ్యలో 36% పెరుగుదల మరియు విలువ పరంగా 25% వృద్ధి నమోదు అయింది. డిజిటల్ పేమెంట్స్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందనడానికి ఇది సంకేతం.
అంతేకాకుండా, ఏప్రిల్ 1 నుంచి కొత్త UPI నిబంధనలు అమలులోకి వచ్చాయి. పాత, యాక్టివ్‌గా లేని మొబైల్ నంబర్‌కు లింక్ అయిన UPI IDలు ఇక పని చేయవు. బ్యాంక్ రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్ వాడని వారైతే, ఆ UPI ID కట్ అవుతుంది. ఇకపై నంబర్ యాక్టివ్‌గా లేకుంటే UPI పేమెంట్స్ చేయలేరు.
Related News
UPI మార్కెట్‌లో ఎవరు నంబర్ 1?
UPI డిజిటల్ ఇండియాకు ప్రధానమైన ఆర్థిక మద్దతుగా మారింది. ప్రపంచంలోనే భారతదేశం డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం PhonePe UPI మార్కెట్‌లో 50% కంటే ఎక్కువ వాటా కలిగి అగ్రస్థానంలో ఉంది. ఇది Walmart కంపెనీకి చెందినదిగా NPCI డేటా చెబుతోంది. Google Pay, Paytm వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ పోటీగా ఉన్నప్పటికీ, PhonePe మార్కెట్‌ను దోచుకుంటోంది.
క్యాష్ ఉపయోగం తగ్గిపోతుంటే, UPI సేవలు పెరుగుతున్నాయి. మరి మీరు ఇంకా క్యాష్ మీదే ఆధారపడుతున్నారా? మీ ఆలోచన కామెంట్స్‌లో చెప్పండి.