యువ హీరో నితిన్ తాజా చిత్రం ‘తమ్ముడు’లో నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజుల కాంబో చిత్రాలు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ మంచి వాణిజ్య విజయాన్ని సాధించాయి. దీనితో నితిన్ రాబోయే చిత్రం ‘తమ్ముడు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదే జరిగితే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ, ‘తమ్ముడు’ చిత్రం విడుదల కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సంబంధించిన తాజా వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వేసవి స్పెషల్‌గా మే 9న ‘తమ్ముడు’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమాలో సీరియల్ నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది.