బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వాసు సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆదివారం సాయంత్రం నుంచి నాన్‌స్టాప్‌గా పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 150 మంది హాజరయ్యారని, పార్టీలో డ్రగ్స్ అమ్ముతున్న పలువురు వ్యాపారులు దొరికిపోయారని తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ కూడా హాజరయ్యారని, బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని వార్తలు వచ్చాయి.
వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌భావ్‌లను అరెస్టు చేశామని, వాసు పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వాసు, అరుణ్ బంధువులని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తానికి అరుణ్ బాధ్యతగా వ్యవహరించారు.