తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. పాత కార్డులకు భిన్నంగా, ATM కార్డు పరిమాణంలో స్మార్ట్ కార్డుల రూపంలో వాటిని జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్డుల డిజైన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒక వైపు సీఎం ఫోటో, మరోవైపు పౌర సరఫరాల మంత్రి ఫోటో మధ్యలో ప్రభుత్వ లోగో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు అందులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కార్డు వెనుక చిరునామా, రేషన్ షాపు నంబర్, ఇతర వివరాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం రేషన్ కార్డు లాంటి కార్డును తీసుకురాబోతున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే సీఎం రేవంత్‌కు అనేక డిజైన్లను చూపించారు.
ఒక్కసారి దరఖాస్తు చేసుకోండి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు ఉన్నారు. మొదట్లో లక్ష కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కుల గణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవా కేంద్రాల ద్వారా 4 రకాల దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.