Ration Cards : కొత్త రేషన్ కార్డులు ఉగాదికే..

తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సమయం నిర్ణయించారు. రాబోయే ఉగాది నుండి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలో రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు కొత్త వ్యవస్థలో ఉండబోతున్నాయి. కార్డులలో ATM కార్డు పరిమాణంలో QR కోడ్, లేత నీలం రంగు ఉంటుంది. కార్డులలో ఒక వైపు CM రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. మొదట కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాటిని జారీ చేస్తారు. ఆపై ప్రభుత్వం దశలవారీగా అందరికీ ఈ కొత్త కార్డులను జారీ చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవా కేంద్రాల నుండి 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీనితో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామాలలో 24 లక్షల మార్పులు జరిగాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కొత్త కార్డులు జారీ చేసే ముందు రేషన్ కార్డుల డిజైన్‌ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటీఎం కార్డుల మాదిరిగా ప్రత్యేక చిప్ లేదా క్యూఆర్ కోడ్‌తో కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. నాలుగు నెలల క్రితం అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రేషన్ పంపిణీ, కార్డు వ్యవస్థను అధ్యయనం చేసి అదే విధంగా జారీ చేయాలని నిర్ణయించారు. మార్చి 1న లక్ష కొత్త కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కార్డుల పంపిణీ వాయిదా పడింది. చివరకు ఉగాది నాడు కొత్త కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.