రిటైర్మెంట్‌కి ముందుగానే రెగ్యులర్ ఆదాయం రావాలనుకునేవారికి LIC New Jeevan Shanti ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఇది మార్కెట్‌కు సంబంధం లేని ఒక డిఫర్డ్ అన్యుటీ ప్లాన్, అంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత కొంతకాలం (1-5 ఏళ్ల వరకు) తరువాత పెన్షన్ పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్ ద్వారా లైఫ్ టైమ్ పెన్షన్ అందుకుంటారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ ప్లాన్‌లో పెట్టుబడి – లాభాల వివరాలు
1. ₹6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే:
- ఏటా: ₹38,400 – ₹57,600
- అర్ధ సంవత్సరానికి: ₹19,200 – ₹28,800
- త్రైమాసికం: ₹9,600 – ₹14,400
- నెలకు: ₹3,200 – ₹4,800
2. ₹12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే:
Related News
- ఏటా: ₹76,800 – ₹1,15,200
- అర్ధ సంవత్సరానికి: ₹38,400 – ₹57,600
- త్రైమాసికం: ₹19,200 – ₹28,800
- నెలకు: ₹6,400 – ₹9,600
3. ₹18 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే:
- ఏటా: ₹1,15,200 – ₹1,72,800
- అర్ధ సంవత్సరానికి: ₹57,600 – ₹86,400
- త్రైమాసికం: ₹28,800 – ₹43,200
- నెలకు: ₹9,600 – ₹14,400
ఈ స్కీమ్ ప్రత్యేకతలు:
- 100% భద్రత: మార్కెట్ మార్పుల ప్రభావం ఉండదు.
- లైఫ్‌టైమ్ పెన్షన్: జీవితాంతం రెగ్యులర్ ఆదాయం.
- ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు.
- జాయింట్ లైఫ్ ఆప్షన్: భార్యాభర్తలు కలిసి పొందవచ్చు.
- టాక్స్ బెనిఫిట్స్: 80C కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది.
ఎవరికి తగినది?
- రిటైర్మెంట్ తర్వాత ఖర్చులకు సురక్షిత ఆదాయం కావాలనుకునేవారికి.
- వృద్ధుల కోసం నమ్మదగిన ఆదాయ వనరు.
- భవిష్యత్తులో రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలనుకునే వారికీ బెస్ట్ ఆప్షన్.
ఎవరికి అర్హత ఉంది?
- కనీస వయస్సు 30 ఏళ్లు, గరిష్ఠం 79 ఏళ్లు
- కనీస ఇన్వెస్ట్‌మెంట్ ₹1,50,000
- గరిష్ఠ పరిమితి లేదు (ఎక్కువ పెట్టుబడికి ఎక్కువ పెన్షన్ లభిస్తుంది).
LIC New Jeevan Shanti ప్లాన్ ఎప్పుడు తీసుకోవాలి?
- మీ రిటైర్మెంట్‌కు ముందు పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి పెట్టుబడి పెట్టి, భవిష్యత్తులో రెగ్యులర్ ఆదాయం పొందాలనుకునే వారు దీన్ని తీసుకోవచ్చు.
రేపటి భద్రత కోసం నేడు స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. LIC New Jeevan Shanti ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మీ దగ్గర LIC ఏజెంట్‌ను సంప్రదించండి.