హోండా తన కొత్త QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.90,000గా పేర్కొంది. ఇక బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. కస్టమర్లు కేవలం రూ. 1000 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ఫీచర్స్
Related News
హోండా QC1 5-అంగుళాల LCD క్లస్టర్, పూర్తి LED లైటింగ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన లక్షణాలతో వస్తుంది. అదనంగా, కస్టమర్లు దీనిలో 26-లీటర్ నిల్వను పొందుతారు. దీనికి 2 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, స్టాండర్డ్. సస్పెన్షన్ కోసం.. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను ఉపయోగిస్తుంది. బ్రేకింగ్ కోసం.. డ్రమ్ బ్రేక్ సౌకర్యం కల్పించారు. దీనిలో USB ఛార్జర్ అందించారు.
బ్యాటరీ, పరిధి
కొత్త హోండా QC1 1.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయబడితే 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 1.8kW BLDC మోటారుతో అమర్చబడి గంటకు 50 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ 330-వాట్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. 0-80% ఛార్జింగ్ 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. కంపెనీ 90,000 (ఎక్స్-షోరూమ్) ధరకు ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేఇది మంచి అవకాశం.