ఎన్నికల స్టాక్‌లు: దేశంలో జరిగే ప్రతి వేడుకలు మరియు ప్రత్యేక ఈవెంట్‌లకు స్టాక్‌లు ప్రతిస్పందిస్తాయి. ఇక ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ అయినా ఎన్నికల సందర్భంగా రకరకాల స్టాక్స్ హాట్ కేకుల్లా మారాయి.
కేంద్రంలో మరోసారి బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధానిగా పగ్గాలు చేపడితే పెరగనున్న షేర్లపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇదే విషయంపై విదేశీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ CLSA ‘Modi Stocks’ పేరుతో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ప్రధానిగా మోదీ గత 10 ఏళ్లలో అమలు చేసిన సంస్కరణల వల్ల భారీ వృద్ధిని సాధించిన కంపెనీలతో ఈ జాబితాను రూపొందించి ఈ పేరు పెట్టారు. ఈ జాబితాలో మొత్తం 54 స్టాక్‌లు చోటు దక్కించుకున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత భారీ వృద్ధితో దూసుకుపోవడం ఖాయమని CLSA అంచనా వేసింది.
ఈ జాబితాలో సగానికి పైగా ప్రభుత్వ రంగ సంస్థలవే కావడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల స్టాక్స్ భారీగా లాభపడ్డాయని సీఎల్ఎస్ఏ వెల్లడించింది. ఈ జాబితాలో NTPC, NHPC, PFC, ONGC, IGL, Mahanagar Gas, L&T, Airtel, Reliance, Indus Towers వంటి స్టాక్స్ ఉన్నాయి.
ఎన్నికల కోలాహలానికి ముందు నుంచీ జాబితాలోని మెజారిటీ స్టాక్‌లు నిఫ్టీని నుంచి రాబడిని ఇచ్చాయని CLSA తెలిపింది. ఎన్నికల తర్వాత బ్యాంకు స్టాక్స్‌లో మంచి ర్యాలీ ఉంటుందని అంచనా. ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయాలని మోదీ ఇటీవల సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇన్‌ఫ్రా, సిమెంట్, రియాల్టీ షేర్లు దూకుడు ప్రదర్శించేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనపై మోదీ ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.