భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ పెరిగిపోతుంది. CNG కార్లును అత్యంత ఇష్టపడుతున్నారు. ఇంటి నుండి ఆఫీసుకు లేదా మరేదైనా పని మీద కారులో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, CNG కార్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం CNG ధర రూ. 75 ఉండగా, పెట్రోల్ ధర దాదాపు రూ. 100 ఉంది. ఇప్పుడు CNG ఆధారిత కారు కిలోకు 30-34 కి.మీ మైలేజీని అందిస్తుంది. పెట్రోల్‌తో నడిచే కారు మైలేజ్ లీటర్‌కు 15-20 కి.మీ ఇస్తుంది. తక్కువ ధర కలిగిన CNG కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ కార్స్ బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పవచ్చు.
Maruti Alto K10 (CNG)
మారుతి ఆల్టో K10 CNG లో కూడా వస్తుంది. దీని ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.70 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో శక్తివంతమైన 1.0L పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఈ కారు CNGలో కూడా లభిస్తుంది. కిలోకు 33.85 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 5 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. భద్రత కోసం… కారులో EBD మరియు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
Maruti S-Presso (CNG)
ఎస్-ప్రెస్సో ఒక గొప్ప కారు. కానీ, దాని ధర ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వినియోగదారులు కొనడానికి అంతలా మస్కతి చూపించారు. ఈ కారులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఈ కారు CNG లో కూడా లభిస్తుంది. కిలోకి 32.73 కి.మీ/కి.గ్రా మైలేజీని ఇస్తుంది. దీని సీటింగ్ పొజిషన్ మీకు SUV లాంటి అనుభూతిని ఇస్తుంది. ఈ కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. దీని ధర రూ. 5.91 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Maruti Wagon-R (CNG)
కుటుంబంలో ఎక్కువ మంది ఉండి, స్థలం కొరత లేని కారు కొనాలనుకుంటే, మారుతి వాగన్-ఆర్ మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మంచి స్థలం కూడా లభిస్తుంది. ఈ కారు 1.0L పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంది. మైలేజ్ గురించి చెప్పాలంటే.. ఈ కారు CNG మోడ్‌లో 34.43 కి.మీ/కి.గ్రా మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం.. కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీని ధర రూ. 6.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది.