Megastar Chirnajeevi: మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం! ఏంటంటే ?

మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడి సినిమాకి సంబంధించిన ఓ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తానని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రాజకీయంగా తాను సాధించాలనుకున్న అన్ని ఆశయాలను సాధించారనే ఆనందం తనకు సరిపోతుందని అన్నారు.

అలాగే, ఇటీవల వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నాయకులతో జరిగిన సమావేశానికి స్పందిస్తూ, సినీ పరిశ్రమకు అవసరమైన సహకారం కోసమే వారిని కలుస్తున్నానని చెప్పారు.

Related News

బ్రహ్మానందం సినిమా కార్యక్రమంలో చిరంజీవి తన జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన జీవితాంతం కళామ్మతల్లి  సేవలో గడుపుతానని సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన అభిమానులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే, బ్రహ్మానందం కార్యక్రమం ఈలలు, కేకలతో నిండిపోయింది. అయితే, ఈరోజు చిరంజీవి ప్రకటించిన నిర్ణయంతో, గత కొన్ని రోజులుగా ఆయనపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.