జర్మనీలో ఉద్యోగం వదిలి ఇండియాలో లడ్డూలు అమ్ముకుంటూ కోట్ల సంపాదన…

విదేశాల్లో ఉన్న మంచి జాబ్‌ను వదిలి వచ్చి భారత్‌లో వ్యాపారం మొదలుపెట్టడం చాలామందికి అసాధ్యమే అనిపిస్తుంది. కానీ జోధ్‌పూర్‌కు చెందిన అశోక్ కుమావత్ ఈ పని చేసి చూపించారు. జర్మనీలో నెలకు రూ.2 లక్షల జీతం తీసుకుంటూ రోబో ట్రైనర్‌గా పనిచేసిన ఆయన, దేశానికి ఏదైనా చేయాలన్న భావనతో ఇండియాకు తిరిగి వచ్చారు. తన తండ్రి వ్యవసాయంలో ఉన్న అనుభవాన్ని, కరోనా టైమ్‌లో అమ్లా ప్రోడక్ట్స్‌కి పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించి ఒక స్టార్టప్ మొదలుపెట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

25 లక్షల పెట్టుబడి… స్వయంరోజ్గార్ యోజనతో మారిన జీవితం

ఇండియాకు వచ్చాక, అశోక్ నేరుగా అమ్లా, బాజ్రా ఆధారిత ప్రోడక్ట్స్ తయారీకి శిక్షణ తీసుకున్నారు. ప్రధాన్ మంత్రి స్వయంరోజ్గార్ యోజన ద్వారా రూ.25 లక్షల రుణం తీసుకుని తన సొంత పొలంలో వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఎక్కువవడంతో జోధ్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లాట్ కొనుగోలు చేసి అక్కడే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేశారు. 2020లో ఈ వ్యాపారం పూర్తిగా ప్రారంభమైంది.

Related News

కోట్ల టర్నోవర్… 30 మందికి ఉద్యోగం

వెనకబడి ప్రారంభమైన ఈ వ్యాపారం మొదట్లో రూ.25 లక్షల టర్నోవర్ కలిగి ఉండగా, ఇప్పుడు వార్షికంగా రూ.1 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం 25–30 మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు. అతని 14 ఏళ్ల పాత అమ్లా తోటలో 1,000 చెట్లు ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం రూ.8–10 కిలోకి అమ్మే అమ్లా, ఇప్పుడు ప్రాసెసింగ్ చేసి రూ.200–250కి అమ్ముతున్నారు.

అమ్లాతో పాటు మిల్లెట్స్… డబుల్ బిజినెస్

అశోక్ ఇప్పుడు అమ్లా లడ్డూలతో పాటు మిల్లెట్ ఆధారిత హెల్త్ ఫుడ్స్ తయారు చేస్తున్నారు. దేశీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇవి కూడా చాలా వేగంగా అమ్మకాలు సాధిస్తున్నాయి. న్యూట్రిషన్ పరంగా పుష్కలంగా ఉండటంతో వీటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.

ఇతర యువతకు మార్గదర్శకుడు

తనతో పాటు పక్క గ్రామాల్లో ఉన్న యువతకూ ఈ బిజినెస్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ట్రైనింగ్ ఇస్తూ, చిన్న ఫలాలు కూడా ఎలా విలువను పెంచి పెద్ద వ్యాపారంగా మార్చవచ్చో నేర్పుతున్నారు. అశోక్ కథ యువతకు స్పూర్తిదాయకంగా మారుతోంది.

ఇతను పెట్టిన రూ.25 లక్షల పెట్టుబడితో… ఇప్పుడు ప్రతి ఏడాది రూ.1 కోటి టర్నోవర్ సంపాదిస్తున్నాడు. ఇది దేశీ వ్యాపారాలు ఎంత అవకాశాలు కలిగి ఉన్నాయో చూపే జీవచిహ్నం.