మంచు విష్ణు చిత్రబృందం మరో వివాదంలో చిక్కుకుంది. జల్‌పల్లి అడవుల్లో విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడారు. మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడి తీసుకెళ్లారు.
వేటాడిన అడవి పందులను ఎలక్ట్రీషియన్ దేవేంద్రప్రసాద్ పట్టుకుని తీసుకెళ్లారు. అడవి పందులను పట్టుకుని తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అడవి పందులను వేటాడిన వారిపై అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వీరిపై ఇప్పటికే నెటిజన్లు మరో విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.