
వైఎస్ జగన్ రెంటపల్ల పర్యటనలో ప్రమాదవశాత్తు చిల్లి సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన భర్త మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని ఆమె అన్నారు.
వైఎస్ జగన్ రెంటపల్ల పర్యటనలో మరణించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూరుదుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త స్వల్ప గాయాలతోనే మరణించాడనేది నమ్మశక్యం కాదని.. అంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
[news_related_post]“నా భర్త మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయి. సింగయ్య చిన్న గాయాలతోనే ఎలా చనిపోయాడు?. ప్రమాదం జరిగినప్పుడు, వారు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగి ఉండాలి. ఏదో జరిగిందని మేము అనుమానిస్తున్నాము” అని ఆమె అన్నారు.
ఈ కేసు విషయంలో పోలీసులు మరియు ప్రభుత్వం నుంచి తమపై ఒత్తిడి ఉందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “లోకేశ్ మనుషుల్లో యాభై మంది మా ఇంటికి వచ్చారు. వారు చెప్పినది చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులానికి చెందిన వారమని చెప్పారు. కొన్ని పత్రాలపై సంతకం చేయమని అడిగారు. నేను దానికి అంగీకరించలేదు. వారు మమ్మల్ని బెదిరించారు. మరోవైపు..
పోలీసులు తన భర్త వీడియోను కూడా చూపించి, కొన్ని పత్రాలపై సంతకం చేయమని అడిగారు. వారు నాపై మరియు నా కుటుంబంపై అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చారు. మా కుటుంబం జగన్‌ను చాలా ప్రేమిస్తుంది” అని ఆమె అన్నారు.
ఏం జరిగిందంటే..
జూన్ 18న, వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామంలో పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో, సింగయ్య అనే కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించాడు. జగన్ కాన్వాయ్ కారణంగా సింగయ్య మరణించాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు, పలువురు వైఎస్ఆర్సిపి నాయకులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అయితే..
ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా తనపై కేసు నమోదు చేసిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రమాదం జరిగినప్పుడు కారులోని ప్రయాణికులపై ఎలా కేసు నమోదు చేయగలరని పోలీసులను ప్రశ్నించింది. సింగయ్య మరణానికి జగన్ ఎలా బాధ్యత వహిస్తారు? మంగళవారం జరిగిన తాజా విచారణలో, వైఎస్ జగన్‌పై దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.