ఎలక్ట్రిక్ కార్ల వాడకం బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ ల ట్రెండ్ కొనసాగుతోంది. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నాయి. అధునాతన సాంకేతికత మరియు తాజా లక్షణాలతో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్లోకి మినీ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారును చౌక ధరకు తీసుకువస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని రూ. 1 లక్షకు అందించనున్నట్లు సమాచారం.
చాలా మంది బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారును కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, లిజియర్ కంపెనీ మినీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. యూరోపియన్ మోడల్ ఆధారంగా, ఈ 2-సీటర్ మినీ EVని విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో తీసుకువస్తున్నారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 192 కి.మీ వరకు ప్రయాణిస్తుందని అంచనా. సొంత కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. వారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
లిజియర్ మినీ EV G.OOD, I.DEAL, E.PIC, మరియు R.EBEL వేరియంట్లలో వస్తుందని భావిస్తున్నారు. మూడు బ్యాటరీ ఎంపికలు ఉంటాయని పుకార్లు ఉన్నాయి. వీటిలో 4.14 kWh, 8.2 kWh, మరియు 12.42 kWh ఉన్నాయి. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. ఈ EV కేవలం రెండు తలుపులు మాత్రమే కలిగి ఉంటుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో హీటెడ్ డ్రైవర్ సీటు మరియు కార్నర్ AC వెంట్స్ వంటి లక్షణాలను ఇందులో చూడవచ్చు.