వీకెండ్ లో నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు . మాంసం ప్రియులు నాన్ వెజ్ తినేటప్పుడు కర్రీ మీద ఎక్కువగా నిమ్మకాయ పిండుతారు. అలా నిమ్మకాయ పిండడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం..
మాంసం మీద నిమ్మరసం ఎందుకు పిండుతారో మీకు తెలుసా..
నాన్ వెజ్ మరియు నిమ్మకాయ : ఏమి జరుగుతుంది
సాధారణంగా, మటన్ చికెన్ లేదా ఇంకేదైనా నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు చాలా మంది కూర మీద నిమ్మకాయ రసం పిండుతారు. మాంసంలో నిమ్మకాయ పిండడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేక రుచి..
మాంసాహారం తినేవారు మాంసం మీద నిమ్మకాయ పిండడం సహజం. నిమ్మరసం మాంసానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మాంసంలోని ఏదైనా చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. మాంసం మీద నిమ్మకాయ పిండడం వల్ల తినేవారికి తాజా రుచి వస్తుంది. నిమ్మకాయలోని సిట్రస్ ఆమ్లాలు నిస్సందేహంగా మాంసానికి మృదుత్వాన్ని జోడిస్తాయి.
జీర్ణక్రియ..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మన శరీరంలోని అనేక రసాయనాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మాంసం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. నిమ్మకాయను పిండడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేయవచ్చు.
హానికరమైన బ్యాక్టీరియా..
తాజా మాంసంలో కొన్నిసార్లు హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. నిమ్మకాయలో ఈ బ్యాక్టీరియాను చంపే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మాంసం మీద నిమ్మరసం పిండడం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.
(గమనిక: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా మీకు అందించబడింది. విషయాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.)