రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 పత్రాన్ని ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2014-19 వరకు తన హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి 4 శాతం తగ్గిందన్నారు. గత ఐదేళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.
తన నియోజకవర్గం అంటూ కుప్పంలో కక్ష సాధింపుకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. అయితే రానున్న రోజుల్లో కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
Related News
ఇందుకోసం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. కష్టపడకపోతే అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ గెలవలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.