చదువు కోరిక ఉన్నా డబ్బులేక అనేక మంది చదువుకు దూరం అవుతున్నారు .. . అలాంటి వారి కోసం ప్రభుత్వాలు స్కాలర్‌షిప్‌లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఏడాదికి ఏకంగా రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్ అందించేందుకు సిద్ధం అయ్యింది .
దీనికోసం ఎవరు అర్హులు?
కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ను Kotak Kanya Scholarship 2024-25 పేరిట అందిస్తోంది, విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. విద్యార్థినులను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించేందుకు, వారు రాణించేందుకు తోడ్పాటునందించేందుకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ స్కాలర్ షిప్ అందజేస్తారు.
Related News
- ఇంటర్‌లో 75 % మార్కులు సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇంజనీరింగ్, MBBS, BDS, ఇంటిగ్రేటెడ్ LLB (5 సంవత్సరాలు), B.ఫార్మసీ, B.Sc వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న మహిళా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు మరియు దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి