
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి హీట్ పెరిగింది. ఎందుకంటే టెక్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండు భారీ ఫ్లాగ్షిప్ సిరీస్‌లు సెప్టెంబర్, అక్టోబర్ 2025లో ఆవిర్భవించబోతున్నాయి. ఒకవైపు Xiaomi 16 సిరీస్‌తో షియోమి రంగంలోకి దిగుతుండగా, మరోవైపు Vivo కూడా తన కొత్త Vivo X300 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ రెండు ఫోన్లు సూపర్ ఫీచర్లతో వస్తుండటంతో ఇప్పుడు ఫోన్ మార్చాలనుకుంటున్నవాళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
Xiaomi మరోసారి తన నంబర్ సిరీస్‌లో భారీ మార్పులతో వస్తోంది. Xiaomi 16, Xiaomi 16 Pro, Xiaomi 16 Ultra, Xiaomi 16 Pro Max ఇలా నాలుగు మోడల్స్ వచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌ను 2025 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ చేయబోతున్నారు.
ఇందులో ప్రధాన ఆకర్షణ Snapdragon 8 Elite 2 చిప్సెట్. ఇది Qualcomm నుంచి వస్తున్న సరికొత్త ప్రాసెసర్. గేమింగ్, మల్టీటాస్కింగ్ పరంగా ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో 7000mAh వరకు పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత.
[news_related_post]డిస్ప్లే విషయానికి వస్తే, Xiaomi 16లో 6.32 లేదా 6.36 అంగుళాల OLED ఫ్లాట్ డిస్ప్లే ఉండొచ్చు. 120Hz రిఫ్రెష్‌రేట్ ఉండడం వల్ల స్క్రోల్, గేమ్ ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. Xiaomi 16లో 50MP మెయిన్ కెమెరాతో పాటు పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది ముందు వరకు Ultra మోడల్స్‌లో మాత్రమే ఉండేది.
అదేవిధంగా, Android 16 ఆధారంగా HyperOS 3పై ఈ ఫోన్ రన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ కూడా క్లాస్ మైగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కెమెరా మాడ్యూల్ కూడా స్క్వేర్ ఆకారంలో ఉండబోతుండటంతో, ఫోన్ లుక్ మరింత ప్రీమియంగా కనిపించనుంది.
ఇక Vivo కూడా Xiaomiకి పోటీగా తన X300 సిరీస్‌ను అక్టోబర్ 2025లో తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా కెమెరా ఫీచర్లే హైలైట్. Vivo X300 Proలో 200MP పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉండనుంది. ఇది పెద్ద 1/1.4 ఇంచ్ సెన్సార్‌తో వస్తుందట. దీంతో జూమ్ ఫోటోలు తీసినప్పుడు కూడా డిటెయిల్ నష్టపడదు.
ఇక ప్రధాన కెమెరాగా 50MP Sony LYT-828 సెన్సార్ ఇవ్వనున్నారు. ఇది చాలా క్లారిటీతో వస్తుంది. అలానే, 50MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఫోన్లో భాగం కానుంది. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
వివో ఈ ఫోన్ లో కూడా 7000mAh బ్యాటరీ ఇచ్చే అవకాశముంది. దీనితో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండనుంది. డిస్ప్లే పరంగా చూస్తే 6.8 అంగుళాల OLED ఫ్లాట్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్‌రేట్‌తో వస్తోంది. లుక్, ఫీల్ పరంగా కూడా ఇది టాప్ క్లాస్‌గా ఉండబోతుంది.
ఈ రెండు ఫోన్లు కూడా ప్రీమియం సెగ్మెంట్లో రానున్నాయి. Xiaomi 16 ప్రారంభ ధర సుమారు రూ. 55,000 – 60,000 ఉండొచ్చు. Vivo X300 సిరీస్ ప్రారంభ ధర కూడా ఇదే పరిధిలో ఉండే అవకాశం ఉంది. అయితే మీరు పెట్టే ఈ ఒక్కసారి ఖర్చుకు మీరు పొందే ప్రయోజనాలు, ఫీచర్లు చూస్తే మీరు ఖచ్చితంగా బాగుందని ఫీలవుతారు.
డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసింగ్ పవర్ ఇలా ప్రతి అంశంలో ఈ ఫోన్లు ప్రస్తుత మార్కెట్లోని ఫోన్లకన్నా రెండు అడుగులు ముందుంటాయి. అందుకే ఫోన్ మారాలనుకుంటున్న వారు ఇక వెయిట్ చేయకండి. Xiaomi సిరీస్ సెప్టెంబర్‌లో, Vivo X300 సిరీస్ అక్టోబర్‌లో రాబోతున్నాయి. అప్పటిదాకా మీ బడ్జెట్ సిద్ధం చేసుకోండి.
Xiaomi మరియు Vivo ఫోన్లు రెండూ తమదైన శైలిలో మార్కెట్‌ను షేక్ చేయబోతున్నాయి. 2025 సెప్టెంబర్ నుంచి Android ప్రీమియం ఫోన్ల మధ్య నిజమైన పోటీ మొదలవబోతోంది. మీరు కెమెరా ప్రియులా? లేక గేమింగ్ లవర్‌లా? మీరు కోరుకునే ఫోన్ ఆ పోటీలో తప్పకుండా ఉంటుందనే విషయం మాత్రం క్లియర్.