
,ఈ మధ్య ఫోన్ మార్కెట్లో ఏ ఫోన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఎక్కువే. రెండు స్మార్ట్ఫోన్లు ఈ మధ్య కాలంలో బాగా హైప్ క్రియేట్ చేశాయి. ఒకటి Samsung Galaxy S24 Ultra. మరొకటి Oppo Reno 14 5G. ఒక్క దానికొక స్టైల్ ఉంది. ఒకటి పూర్తిగా పవర్‌పుల్ ఫీచర్లతో రారాజుగా నిలుస్తుంటే, మరొకటి స్లిమ్ బాడీ, బెటర్ సెల్ఫీ కెమెరాతో మధ్యతరగతి ధరలో మాయ చేస్తోంది.
Samsung Galaxy S24 Ultra అంటేనే ప్రీమియం ఫీచర్లు. ఇది ₹74,999కి లభ్యమవుతుంది. అయితే ఇది ప్రారంభ ధర కంటే దాదాపు ₹9,000 తగ్గింది. అటు Oppo Reno 14 5G మాత్రం ₹37,999కే వస్తోంది. అంటే ధరలోనే డబుల్ తేడా. ఇప్పుడు చూద్దాం – ఈ ధరకు ఏ ఫోన్ నిజంగా మీ డబ్బుకు విలువ ఇస్తుంది?
Samsung Galaxy S24 Ultraలో Snapdragon 8 Gen 3 చిప్ ఉంటుంది. ఇది 3.3 GHz వేగంతో రన్ అవుతుంది. ఇందులో 12 GB RAM ఉంటుంది. దీని పనితీరు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గేమింగ్, వీడియో ఎడిటింగ్, హేవీ యాప్స్ అన్నీ ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. ఇక Oppo Reno 14 5Gలో కొత్తగా వచ్చిన MediaTek Dimensity 8350 చిప్ ఉంది. ఇది 3.35 GHz వేగంతో నడుస్తుంది. దీంట్లో 8 GB RAM తో పాటు 8 GB వర్చువల్ RAM కూడా ఉంది. వేగం పరంగా Reno మంచి పని చేస్తే కానీ, గ్రాఫిక్స్ లేదా హీట్ మేనేజ్మెంట్లో మాత్రం Samsung ఆధిపత్యమే ఉంటుంది.
[news_related_post]Samsung ఫోన్లో 6.8 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1440×3120. బ్రైట్నెస్ 2600 నిట్స్. అంటే బాహ్యంగా కళ్లకు బాగా కనపడుతుంది. గోరిల్లా గ్లాస్ ఆర్మర్ తో వస్తుంది. స్క్రోల్ స్మూత్‌గా ఉండేందుకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది.
ఇక Oppo డిస్ప్లే కూడా AMOLED ఐతే, కొంచెం చిన్నది. 6.59 ఇంచ్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కానీ రిజల్యూషన్ Samsung కంటే తక్కువ. కానీ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. అంటే గేమర్లకు ఇది మక్కువ కలిగించే ఫీచర్. అయినా కూడా డిస్ప్లేలో నాణ్యత, బ్రైట్నెస్, విజువల్స్ పరంగా Samsung మరో మెట్టు పైనే.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. Oppo ఫోన్లో 6000 mAh బ్యాటరీ ఉంది. దీనితో పాటు 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే చాలా వేగంగా చార్జ్ అవుతుంది. Samsung ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. దీనికి 45W ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. కానీ ఇందులో వయర్లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అంటే ఫీచర్ల పరంగా Samsung మొగ్గు చూపితే, ప్యూర్ ఛార్జింగ్ స్పీడ్‌లో Oppo ఆధిక్యత చూపిస్తుంది.
Samsung Galaxy S24 Ultraలో 200MP కెమెరా ఉంది. ఇది 8K వీడియో రికార్డింగ్ చేయగలదు. ఫొటోలు, వీడియోలు తీయడం, అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ముందు కెమెరా 12 MP మాత్రమే ఐనప్పటికీ, మంచి క్లారిటీ ఇస్తుంది.
ఇక Oppo Reno 14 5Gలో వెనక 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. కానీ ముందున్న కెమెరా 50MP. అంటే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇది బెస్ట్. సెల్ఫీ ప్రేమికుల కోసం Oppo మంచి ఎంపిక కానీ, మొత్తం కెమెరా వ్యవస్థలో Samsung ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉన్నవారికి బెస్ట్ చాయిస్ అవుతుంది.
Samsung Galaxy S24 Ultra ఇప్పుడు దాదాపు ₹74,999కి లభిస్తోంది. ఇది అసలైన ప్రీమియం ఫోన్. ఇది భవిష్యత్తుకు కూడా రెడీగా ఉంటుంది. మరొకవైపు Oppo Reno 14 5G ₹37,999లో లభిస్తుంది. ఇది ఎక్కువ ఖర్చు చేయకుండా మంచి ఫీచర్లను అందించగలదు.
Samsung ఫోన్ కొనుగోలుపై Prime Day ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. No-cost EMI, కాష్బ్యాక్ లాంటి ఆఫర్లు రావచ్చు. Oppo Reno 14 5Gపై పెద్దగా బ్యాంకు డీల్స్ లేకపోయినా, EMI ఫెసిలిటీ ఉంది.
మీరు ఫోటోగ్రఫీ, ప్రాసెసింగ్ పవర్, డిస్ప్లే క్లారిటీ వంటి విషయాల్లో ఏ కాంప్రమైజ్ చేయకూడదనుకుంటే Samsung Galaxy S24 Ultra బంగారం లాంటి ఫోన్. మీరు లైట్‌వెయిట్ ఫోన్, మంచి సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీతో తక్కువ ధరలో ఫోన్ కావాలనుకుంటే Oppo Reno 14 5G మీ కోసం ఉంది. మీరు ఏ ఫోన్ ఎంచుకున్నా – మీరు ఏదో ఒకదాంట్లో గెలుస్తారు. కానీ అదనంగా కొంత ఖర్చు పెట్టి భవిష్యత్తు ఫుల్ గ్యారంటీ కావాలంటే Samsung ఎంచుకోవడమే మంచిది.