
ఇప్పుడు మన దేశంలో రోడ్లపై పెద్ద SUVలు, స్టైలిష్ కార్ల హావా చూపిస్తున్నప్పటికీ, మిదటగా ప్రయాణించేవారికి, బడ్జెట్‌ను ముఖ్యంగా చూసే వాహనదారులకు Maruti Suzuki Celerio 2025 ఒక బంగారు అవకాశం. ఇది స్టూడెంట్స్‌కి, చిన్న కుటుంబాలకు, మొదటి సారి కార్ కొనాలనుకునే వారికి పెర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.
ఈ Hatchback కొంచెం స్టైలిష్‌గా కాకపోయినా, అందులోని సౌలభ్యం, మైలేజ్, తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ కారణంగా ఈ కారుకు మార్కెట్లో ఇంకా గట్టి గిరాకీ ఉంది. ఇప్పుడు 2025లో కొత్తగా రీడిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది.
Celerio 2025ను బయట చూస్తే flashy look అనిపించకపోవచ్చు. కానీ కొత్త ఫ్రంట్ గ్రిల్, మెరుగుపరచిన హెడ్‌ల్యాంప్స్, చిన్న చిన్న బాడీ మోడిఫికేషన్లు కలిపి దీనికి సరికొత్త ఫీల్ ఇచ్చాయి. చిన్నది అయినా కూడా దీని ఇంటీరియర్ స్పేస్ మాత్రం పెద్దగా అనిపిస్తుంది. ముఖ్యంగా వెనుక కూర్చునే వారికి తలొంచకుండా కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. ఇంకా 313 లీటర్ల బూట్ స్పేస్ ఉన్నందున వీకెండ్ ట్రిప్స్, రోజువారీ కూరగాయల షాపింగ్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది.
[news_related_post]ఈ కారులో 1.0 లీటర్ K10C DualJet పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 67 HP పవర్, 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి నంబర్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా, సిటీలో డ్రైవింగ్‌కి మాత్రం చాలు అనిపిస్తుంది. కానీ అసలు హైలైట్ ఫ్యూయల్ ఎఫిషెన్సీ. ఇది 26 Km/l మైలేజ్ ఇవ్వగలదు – అది కూడా AMT వేరియంట్లో. అంటే మీరు రోజుకు 40 కి.మీ ట్రావెల్ చేసినా నెలకు పెట్రోల్ ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న పెట్రోల్ కార్లలో ఒకటిగా నిలిచింది.
Celerioను నడపడం చాలా ఈజీ. లైట్ స్టీరింగ్, కాంపాక్ట్ బాడీ కావడంతో ట్రాఫిక్‌లో కూడా దీనిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చిన్నపాటి గోతుల మీద వెళ్లేటప్పుడు కూడా సస్పెన్షన్ పని బాగానే చేస్తుంది. సిటీ రోడ్లకి ఇది మంచి పర్ఫార్మర్. AMT గేర్‌బాక్స్ కూడా చక్కగా స్పందిస్తుంది. కాంటిన్యూస్ బ్రేక్-యాక్సిలరేట్ చేసే ట్రాఫిక్‌కి ఇది బెస్ట్ గేర్ షిఫ్టింగ్ ఇవ్వగలదు. అందుబాటులో ఉన్న 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు, దీనిని ఒక సంపూర్ణ హాచ్బ్యాక్గా నిలుపుతాయి.
Maruti Celerio 2025 ధర రూ.5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. టాప్ మోడల్ AMT వేరియంట్ ధర రూ.7.23 లక్షల వరకు ఉండొచ్చు. మీరు ₹1 లక్ష నుంచి ₹1.5 లక్ష వరకు డౌన్‌పేమెంట్ చేయగలిగితే, నెలకు ₹9,000-₹10,000 EMIతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. పైగా మంచి మైలేజ్ వల్ల నెలకు ₹2,000-₹3,000 పెట్రోల్ లోనే ట్రావెల్ అవ్వొచ్చు.
Maruti Suzuki Celerio flashy కార్ కాదు. కానీ అది కావడమే దీని బలమైన పాయింట్. దీని లో లోపం లేదు. ఇది ప్రాక్టికల్, ఫ్యూయల్ ఎఫిషియెంట్, కంఫర్టబుల్ కార్. ముఖ్యంగా మొదటి సారి కార్ కొనాలనుకునే వారు, లేదా స్టూడెంట్స్, చిన్న కుటుంబాలు – వీరందరికీ ఇది మంచి ఎంపిక.