ఇప్పుడు మార్కెట్లో ₹32,000 ధరకే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉన్న ఫోన్లు వస్తున్నాయి. అటువంటి ఫోన్లలో iQOO నుండి వచ్చిన Neo 10 మరియు Neo 10R వేరే లెవెల్లోనే ఉన్నాయి. చూడ్డానికి రెండూ సమానంగానే కనిపిస్తాయ్. డిజైన్ దగ్గర్నుంచి స్క్రీన్ వరకు చాలా ఏరియాల్లో ఒకేలా అనిపిస్తుంది. కానీ లోపల చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరా లాంటి అంశాల్లో ఈ రెండు ఫోన్లు పూర్తిగా వేరేలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో బెస్ట్ డీలైన ఫోన్ ఏదో తెలుసుకుందాం.
iQOO Neo 10లో ఉంది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్. ఇది 3.2GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఇది Adreno 825 GPUతో వస్తుంది. అంటే గేమింగ్, మల్టీటాస్కింగ్ అనేవి చాలా స్మూత్‌గా జరుగుతాయి. దీనికి AnTuTu స్కోర్ 20 లక్షలకు పైగా వచ్చింది – అంటే 20,66,325 పాయింట్లు. ఇది నిజంగా దిమ్మ తిరిగే స్కోర్. ఇక Neo 10R చూస్తే, ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. క్లాక్ స్పీడ్ 3GHz మాత్రమే. GPU కూడా Adreno 735. దీని AnTuTu స్కోర్ 14,76,651. అంటే పెర్ఫార్మెన్స్లో Neo 10 స్పష్టంగా ముందుంది.
రెండూ LPDDR5X RAM మరియు UFS 3.1 స్టోరేజ్‌ని సపోర్ట్ చేస్తాయి. కానీ రియల్ వల్డ్ యూజ్‌లో Neo 10 స్పీడ్ మరింత ఫాస్ట్‌గా ఉంటుంది. హై ఎండ్ యాప్స్, హేవీ గేమ్స్ ఆడాలనుకుంటే Neo 10 బెటర్ ఆప్షన్.
Related News
రెండు ఫోన్లకు 6.78 ఇంచుల FHD+ AMOLED డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 1260×2800 పిక్సెల్స్. రిఫ్రెష్ రేట్ 144Hz. వీటన్నీ రెండింట్లో ఒకేలా ఉన్నాయి. కాని Neo 10లో స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది 5500 నిట్స్ వరకూ వెళ్తుంది. అదే Neo 10R కేవలం 4500 నిట్స్ మాత్రమే. అందుకే బహిరంగంగా, సూర్యుడు ఉన్న చోట ఫోన్ వాడితే Neo 10 స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్ డీఆర్ కంటెంట్‌ను రెండూ సపోర్ట్ చేస్తాయి. పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌తో అందంగా కనిపిస్తాయి.
Neo 10లో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జ్ వేయగలదు. ఇది నిజంగా అద్భుతం. ఇక Neo 10Rలో 6400mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 80W ఛార్జింగ్‌కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఇది 26 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. అంటే దీర్ఘకాలిక యూజ్‌కి, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చూస్తే Neo 10ను ఎంచుకోవడం మంచిది.
రెఅర్ కెమెరాలో రెండూ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తాయి. కానీ Neo 10లో Omni-directional PD Autofocus ఫీచర్ ఉంది. ఇది ఫోకస్‌ను చాలా ఫాస్ట్‌గా మార్చుతుంది. Neo 10Rలో ఈ ఫీచర్ లేదు. ఫ్రంట్ కెమెరా రెండింట్లో 32MP ఉంది. కానీ వీడియో రికార్డింగ్ విషయంలో పెద్ద తేడా ఉంది. Neo 10 4K@60fps రికార్డింగ్ చేయగలదు. Neo 10R కేవలం 30fps వరకే ఉంటుంది. అంటే వీడియోలు తీయడం, వెలాగింగ్ చేయడం, సెల్ఫీ షూటింగ్ కోసం చూస్తే Neo 10నే బెస్ట్.
రెండూ దాదాపు ఒకే సైజులో ఉంటాయి. పంచ్ హోల్ డిస్ప్లే, ప్లాస్టిక్ బ్యాక్, స్టైల్ లాంటి అంశాల్లో పెద్దగా తేడా లేదు. కానీ Neo 10 బరువు 206 గ్రాములు. Neo 10R కేవలం 196 గ్రాములే. హ్యాండిల్ చేయడంలో లైట్‌వెయిట్ ఫోన్ కావాలంటే Neo 10R కాస్త హ్యాండీగా ఉంటుంది. రెండింటికీ IP65 వాటర్‌ప్రూఫ్ మరియు డస్ట్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది.
రెండు ఫోన్లు Android 15 ఆధారంగా నడుస్తున్న Funtouch OSతో వస్తాయి. OS అప్డేట్స్ 3 సంవత్సరాలు, సెక్యూరిటీ అప్డేట్స్ 4 సంవత్సరాలు ఇస్తాయి. అంటే రెండూ దీర్ఘకాలం వాడదగ్గ ఫోన్లే. ఇక్కడ మాత్రం పెద్ద తేడా లేదు.
₹32,000లో మీరు గేమింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, 4K వీడియో రికార్డింగ్ లాంటి విషయాలను ముఖ్యంగా చూస్తే iQOO Neo 10నే బంగారు ఎంపిక. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్, ప్రాసెసర్ పవర్ అన్నింటా ఇది Neo 10R కన్నా చాలా ముందుంది. కానీ కాస్త తక్కువ బరువు, ఫాస్ట్ డిజైన్ కావాలంటే Neo 10R కూడా డీసెంట్ ఆప్షన్. కానీ ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ కావాలంటే Neo 10 మీకు సరైన ఎంపిక.
ఈ రేంజ్లో అంత పవర్ఫుల్ ఫోన్ ఇప్పటి వరకు రాలేదనేది నిజం…