
ఇప్పటికే మన పరిసరాల్లో వీధి కుక్కలు ఎక్కువయ్యాయి. ఓకేసి వీధుల్లో చూస్తే రెండు, మూడు కాదు.. ఏకంగా ఓ గుంపుగా తిరుగుతూ వాహనదారుల మీద, పాదచారుల మీద దూకుతున్న దృశ్యాలు రోజూ కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుక్క కాటు నుండి కాపాడుకోవడమే కాకుండా, కాటు జరిగితే ఎలాంటి చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే ప్రాణాలకు కూడా ప్రమాదం తప్పదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 20 వేల మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 95 శాతం మందికి కారణం కుక్క కాటే. ప్రభుత్వ చర్యలు చాలినంతగా లేకపోవడం, వీధి కుక్కల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడం వల్ల పరిస్థితి విషమమవుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు కుక్కల బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలోని బద్వేలు పట్టణంలో ఓ పిచ్చికుక్క ఏకంగా 56 మందిని కరిచింది. ఇది ఎంత భయంకరమైన విషయం అనేది అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
అలా కుక్క దగ్గరకి వస్తే వెంటనే పరుగెత్తకూడదు. నిలబడి ఉండాలి. కుక్క కళ్లలోకి చూసినా, హారన్ మోగించినా అది రెచ్చిపోతుంది. గబుగ్బన స్పీడ్ పెంచితే కుక్కలు మరింత వెంటపడతాయి. అలాంటప్పుడు ఓ కొంచెం ప్రశాంతంగా, కదలకుండా ఉండటం ఉత్తమం.
[news_related_post]కుక్కలు పొట్లాడుతున్నప్పుడు ఆ దారిలో పోకూడదు. వీధిలో తినే సమయంలో అవి రెచ్చిపోతే కరిచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక అవి దాడి చేసిన వెంటనే గాయాన్ని శుభ్రం చేయాలి. నీటి ధారలో సబ్బుతో బాగా కడగాలి. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్లి అవసరమైన టీకాలు వేసుకోవాలి. ఆలస్యం చేయకూడదు.
ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నా జాగ్రత్తలు అవసరం. వాటికి వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నాలుగు నెలల వయసులో మొదటి డోస్, ఆ తర్వాత బూస్టర్ డోస్ వేయాలి. ప్రతి పదివేల నెలలకు రెగ్యులర్ వ్యాక్సిన్ వేయిస్తే మంచిది. పెంపుడు కుక్కలతో తిన్న చెతులే మనం తినేందుకు వాడితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగినంత శుభ్రత, జాగ్రత్తలు తప్పనిసరి.
ఇటీవల అమెరికాలో తెలంగాణ వాసిని కుక్క కరిచింది. దానిపై కోర్టు రూ.15 లక్షల పరిహారం నిర్ణయించింది. మన దగ్గర కూడా ఇలాంటి కేసులు తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్క కాటు అని చిన్నగా తీసుకోకండి.. ప్రాణాలకు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ముందే జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండండి.