ఇప్పుడు మార్కెట్‌లో CNG కార్లు బాగా పాపులర్ అవుతున్నాయి. మునుపు క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా వాడితే, ఇప్పుడు ప్రైవేట్ బయ్యర్లూ ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ మీకు CNG కారు తగునా? లేదా పెట్రోల్/డీజిల్ కారే మేలా? నిర్ణయం తీసుకోవాలంటే చదవండి.
ప్రారంభ ధర ఎక్కువే
ఒకే మోడల్ పెట్రోల్ కారు కన్నా CNG కారు ₹1 లక్ష దాకా ఎక్కువ ఖర్చవుతుంది. ఉదాహరణకి Grand i10 Nios Magna పెట్రోల్ వేరియంట్ ₹6.84 లక్షలు అయితే, అదే CNG వేరియంట్ ₹7.75 లక్షలు. ఈ తేడా మర్చిపోకండి
రోజూ ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేస్తేనే లాభం
మీరు రోజూ కనీసం 30 కిమీ కారు నడిపితే, నెలకి 1000 కిమీ దాటితేనే CNG వల్ల మీకు నిజంగా లాభం ఉంటుంది. తక్కువ ఫ్యూయల్ ఖర్చు వల్ల నెలకి ₹2000 వరకు సేవ్ చేయొచ్చు!
Related News
మైలేజ్ బావుంటుంది కానీ పవర్ తక్కువ
CNG మోడ్‌లో కారు పవర్ తక్కువగా ఉంటుంది. స్పీడ్ ఎక్కువ కావాలి అంటే పెట్రోల్ మోడ్‌లో నడపాలి. హిల్లీ ఏరియాల్లో డ్రైవింగ్ ఎక్కువగా చేస్తే CNG కారు సరిపోదు.
బూట్ స్పేస్ తక్కువే
CNG సిలిండర్ వెనుక పెట్టడం వల్ల బూట్ స్పేస్ తగ్గిపోతుంది. ఉదాహరణకి Tata Punch CNG కి 210 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది కానీ పెట్రోల్ వేరియంట్‌కి 366 లీటర్స్
రీసేల్ వాల్యూ తక్కువే
ఇంటర్నెట్‌లో చాలా CNG కార్లు సెకండ్ హ్యాండ్‌గా అమ్ముతుంటారు. కానీ వాటికి డిమాండ్ తక్కువే. మెకానికల్ సమస్యల కారణంగా కొనేవాళ్లు జాగ్రత్త పడతారు.
ఆటోమేటిక్ CNG కార్లు చాలా తక్కువ
చాలా CNG కార్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే వస్తున్నాయి. ఆటోమేటిక్ ఫీచర్ కావాలంటే ఎంపికలు చాలా తక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది
అఫ్టర్ మార్కెట్ CNG కిట్స్ పెట్టించకండి. ఫ్యాక్టరీ ఫిటెడ్ కారు తీసుకోండి. అదే భద్రతకి, వారంటీకి మంచి దారి.
ముగింపు మాట
మీ డ్రైవింగ్ డైలీ 30 కి.మీ పైగా ఉంటే, మరియు మీ ప్రయోజనం మైలేజ్ అయితే, CNG కారు బెస్ట్. కానీ ఎక్కువ పవర్, స్పీడ్, స్పేస్ కావాలంటే పెట్రోల్/డీజిల్ కార్ మీదే ఉండండి.
మీ అభిప్రాయం ఏమిటి? మీరు 2025లో CNG కారు కొనాలని అనుకుంటున్నారా? కమెంట్స్‌లో చెప్పండి!