
OnePlus మళ్లీ మనం వినే క్వాలిటీ ని మార్చింది! ఈసారి OnePlus Buds 4 పేరుతో కొత్త ట్రూ వైరలెస్ ఈయర్బడ్స్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్తగా వచ్చిన Nord 5 స్మార్ట్‌ఫోన్ లైనప్‌తో పాటు ఇవి కూడా లాంచ్ అయ్యాయి. ధర కేవలం ₹5,999. కానీ ఫీచర్ల విషయానికొస్తే ఇది ప్రీమియం లెవెల్‌కి పోటీ ఇచ్చేలా ఉంది.
OnePlus Buds 4 రెండు అద్భుతమైన కలర్స్‌లో వస్తోంది – జెన్ గ్రీన్ మరియు స్టార్మ్ గ్రే. చూసిన దగ్గర నుంచే క్లాసీ లుక్‌ని ఇస్తుంది. దీంట్లో 11mm వూఫర్ మరియు 6mm ట్వీటర్ కలిసే డ్యువల్ డ్రైవర్ సెటప్ ఉంది. వూఫర్‌లో 30-లేయర్ సిరామిక్-మెటల్ డయాఫ్రామ్ ఉండటంతో బాస్ అదిరిపోతుంది. ట్రీబుల్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. IP55 వాటర్ రెసిస్టెన్స్‌తో ఇది రోజంతా ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది.
ఇయర్‌బడ్స్‌లో డ్యూయల్ DACలతో 15Hz నుంచి 40kHz వరకు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం ఉంటుంది. అంటే దీన్ని వింటే ప్రతి బీట్ శబ్దం డీటైల్తో వినిపిస్తుంది. LHDC 5.0 కోడెక్ సపోర్ట్‌తో 1Mbps వరకు స్పీడ్ మరియు 24bit/192kHz లెవెల్లో సౌండ్ రిజల్యూషన్ పొందొచ్చు. ఇది మ్యూజిక్ లవర్స్‌కు, ఆడియోఫైల్ యూజర్లకు నిజంగా ఓ ట్రీట్ అవుతుంది.
[news_related_post]OnePlus Buds 4లో అద్భుతమైన అడ్డాప్టివ్ నాయిస్ కెన్సిలేషన్ (ANC) ఉంది. ఇది ఏకంగా 55dB వరకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని తొలగిస్తుంది. ఇది OnePlus ఈయర్‌బడ్స్‌లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ANC. మీరు బస్సులో ఉన్నా, జనసమ్మేళనంలో ఉన్నా, మ్యూజిక్ సిల్కీ స్మూత్‌గా వినిపిస్తుంది. పైగా ఎడాప్టివ్ మోడ్ ద్వారా మీ చుట్టూ ఉన్న శబ్దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్‌గా ANC, ట్రాన్స్పరెన్సీ మోడ్ల మధ్య మార్చుకుంటుంది.
కాల్ సమయంలో ఇయర్‌బడ్స్ ట్రిపుల్ మైక్రోఫోన్స్‌ను ఉపయోగించి AI Clear Call టెక్నాలజీని అందిస్తుంది. ఈ AI టెక్నాలజీ వాయిస్‌ని కచ్చితంగా క్యాప్చర్ చేసి శబ్దం లేకుండా క్లియర్‌గా పంపుతుంది. అంటే మీరు షాపింగ్ మాల్లో ఉన్నా, ట్రాఫిక్ మధ్యలో ఉన్నా, రిసీవ్ అవుతున్నవాళ్లకి మీ వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది.
OnePlus Buds 4లో మరో ఆసక్తికరమైన ఫీచర్ AI Translation. మీరు ట్రిపుల్ టాప్ చేస్తే ఇది రియల్ టైమ్ వాయిస్ ట్రాన్స్లేషన్ ఇస్తుంది. అయితే ఇది కొన్ని OnePlus ఫోన్లకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా 3D ఆడియో, గోల్డెన్ సౌండ్ పర్సనలైజేషన్, సౌండ్ మాస్టర్ EQ, BassWave 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
OnePlus Buds 4లో గూగుల్ ఫాస్ట్ పెయిర్, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉన్నాయి. మీరు ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు. గేమర్స్ కోసం స్పెషల్ 47ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఉంది. వీడియోలు చూస్తున్నప్పుడు లేదా PUBG, BGMI లాంటివి ఆడుతున్నప్పుడు ఆలస్యం అనిపించదు. బ్యాటరీ విషయానికి వస్తే ANC ఆఫ్ చేసినప్పుడు 45 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. ANC ఆన్ చేసినా 37 గంటల వరకూ బ్యాకప్ ఇస్తుంది. మిరాకల్ అయితే ఏంటంటే, కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది.
OnePlus Buds 4 ఈయర్‌బడ్స్ జూలై 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి వస్తుంది. మీరు దీన్ని Amazon, Flipkart, Myntra, OnePlus.in, Croma, Reliance Digital, OnePlus Experience Storesలో కొనుగోలు చేయొచ్చు. ధర కేవలం ₹5,999 మాత్రమే. ఈ ధరకు ఈ స్థాయి ఫీచర్లు లభించడం వింతే.
ఒక్క సారి చూసుకుంటే ఇవి ప్రీమియం లుక్‌తో, హై-ఎండ్ సౌండ్‌తో, బెటరినింగ్ టెక్నాలజీతో వచ్చిన బెస్ట్ మిడ్-రేంజ్ ఈయర్‌బడ్స్. మీకు డీప్ బాస్, ANC, క్లియర్ కాల్స్, గేమింగ్ మోడ్ కావాలంటే OnePlus Buds 4 బెస్ట్ చాయిస్. మీరు ఇవాళ మిస్ చేస్తే, రేపు ఖచ్చితంగా ఫీలవుతారు…