NPS ఉద్యోగులకు షాక్.. కొత్త UPS స్కీమ్‌తో భారీ మార్పులు.. మీకు ఏమి లభించబోతోంది… ?

2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త Unified Pension Scheme (UPS) ప్రారంభం. NPS లో ఉన్న ఉద్యోగులకు ఇది బిగ్ అప్‌డేట్. రిటైర్మెంట్ తర్వాత గ్యారంటీడ్ పెన్షన్ ఇచ్చే కొత్త స్కీమ్ కావడం తో అందరూ దీని లో ఉన్న ప్రత్యేక అంశాల గురించి తెలుసుకోవాలి ఎదురుచూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UPS అంటే ఏమిటి?

  • ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS కింద రిజిస్టర్ అయ్యారు. అయితే, NPSలో పెన్షన్ మొత్తం మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది.
  • ఈ సమస్యను పరిష్కరించేందుకు UPSని ప్రభుత్వం తీసుకొచ్చింది.
  •  UPS లో రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితమైన (Assured) పెన్షన్ లభిస్తుంది.

UPS – NPS మధ్య తేడా ఏంటి?

అంశం NPS UPS
పెన్షన్ లభ్యత మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది గ్యారంటీడ్ పెన్షన్ లభ్యం
ఉద్యోగి కంట్రిబ్యూషన్ 10% (బేసిక్ + DA) 10% (బేసిక్ + DA)
ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 10% (బేసిక్ + DA) 10% + అదనంగా 8.5%
ఇన్వెస్ట్‌మెంట్ ఎంపికలు ప్రభుత్వ బాండ్లు, 25-50% ఈక్విటీ ఉద్యోగి కంట్రిబ్యూషన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంపికలు, అదనపు 8.5% ప్రభుత్వ హోల్డ్

UPS వల్ల ఎవరికీ లాభం?

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – ఇప్పటి వరకు NPSలో ఉన్నవారు UPSకి మారవచ్చు.
  • గ్యారంటీడ్ పెన్షన్ కోరేవారు – మార్కెట్ రిస్క్‌ లేకుండా స్థిరమైన పెన్షన్ పొందే అవకాశముంది.
  •  పెన్షన్ భద్రత పెరగాలి అనుకునేవారు – ప్రభుత్వం అదనంగా 8.5% పెట్టుబడి పెడుతుంది, అంటే భవిష్యత్తులో పెన్షన్ తీసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.

UPS లో పెట్టుబడులు ఎలా ఉంటాయి?

  • ఉద్యోగి సొంత కంట్రిబ్యూషన్ – ఉద్యోగి తన కంట్రిబ్యూషన్‌ను NPS లాగానే ఇన్వెస్ట్ చేయొచ్చు.
  • ప్రభుత్వం అదనంగా ఇన్వెస్ట్ చేసే 8.5% – ఈ మొత్తం పూల్‌డ్ ఫండ్‌లో నిల్వ ఉండి, ఉద్యోగులకు పెన్షన్ అందించేందుకు ఉపయోగిస్తారు.

UPS నిజంగా NPS సమస్యలను పరిష్కరించగలదా?

  • NPS లో ప్రధాన సమస్య – రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉండేది.
  • UPS సొల్యూషన్ – గ్యారంటీడ్ పెన్షన్ కాబట్టి ఉద్యోగులు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందగలరు.
  •  ప్రభుత్వం అదనంగా 8.5% కంట్రిబ్యూషన్ – దీని వల్ల పెన్షన్ ఫండ్ శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

తుది మాట

  •  UPS కొత్తగా అమలవుతోందని ఉద్యోగులు ఆనందించాలి? లేదా ఇది నష్టం తెచ్చిపెడుతుందా?
  •  రాబోయే రోజుల్లో UPS ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి
  •  మీరు NPSలో ఉన్నారా? UPS కి మారాలా? ఇది మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది?

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.