
మన దేశంలో ప్రతి రంగంలో మహిళల పాత్ర పెరిగిపోతోంది. వారు ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నెలకొల్పుతూ, ఆర్థికంగా స్వయం సమృద్ధికావడంలో ముందున్నారు. ఇలాంటి సమయంలో ఒక మహిళగా మీరు మీ పేరుతో ఒక ఇంటిని కొనాలని భావిస్తున్నారంటే, అది కేవలం ఇంటిని కొనడమే కాకుండా చాలా భారీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ప్రభుత్వం, బ్యాంకులు ఇలా చాలా ఆఫర్లు మహిళలకు ప్రత్యేకంగా ఇస్తున్నాయి. వీటి వల్ల ఇంటి పెట్టుబడి ఖర్చు తగ్గి, మంచి రిటర్న్స్ పొందవచ్చు. కన్సల్టెన్సీ సంస్థల ప్రకారం మహిళలు తమ పేరుతో ప్రాపర్టీ కొనుగోలు చేయడం చాలా మంచి నిర్ణయం. ఒక రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 70 శాతం మహిళలు రియల్ ఎస్టేట్‌ను తమ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్గా పేర్కొన్నారు.
[news_related_post]మన దేశంలోని చాలా బ్యాంకులు మహిళలు గృహ రుణం అప్లై చేస్తే, వడ్డీ రేటులో 0.05% నుంచి 0.10% తగ్గింపు ఇస్తున్నాయి. ఇది చిన్న అంకె లా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది చాలా పెద్ద లాభాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకుని, 20 ఏళ్ల కాలపరిమితి ఉంటే, ఈ చిన్న తగ్గింపుతో మీరు రూ.1 లక్ష వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకొక కీలకమైన లాభం ఏమిటంటే, మహిళలు హోం లోన్ అప్లై చేస్తే, బ్యాంకులు వారికి ప్రాధాన్యత ఇస్తాయి. ఎందుకంటే మహిళలు సాధారణంగా డిఫాల్ట్ చేయడం తక్కువగా ఉంటుంది. అయితే, అప్లికేషన్‌కి కొన్ని షరతులు ఉంటాయి – మహిళ వయసు 21 ఏళ్లు ఉండాలి, స్థిరమైన ఆదాయం ఉండాలి, మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి.
ప్రభుత్వాలు మహిళల పేరుతో ప్రాపర్టీ కొనుగోలుకు ప్రోత్సాహం ఇస్తున్నందున, స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది 1%-2% వరకు ఉంటుంది. ఉదాహరణకు, మహారాష్ట్రలో 1% తగ్గింపు, ఢిల్లీలో 2% తగ్గింపు ఉంది. అంటే రూ.50 లక్షల ఇంటిపై రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు డైరెక్ట్‌గా సేవ్ అవుతుంది.
PMAY స్కీమ్‌లో 6.5% వరకు వడ్డీ సబ్సిడి – చిన్న ఆదాయం ఉన్న వారికి పెద్ద హెల్ప్: ప్రధానమంత్రి అవాస్ యోజన (PMAY) స్కీమ్ కింద, మధ్య తరగతి, తక్కువ ఆదాయ గల మహిళలకు గృహ రుణంపై 3% నుంచి 6.5% వరకు వడ్డీ సబ్సిడి లభిస్తుంది. దీని వల్ల ఇంటి వడ్డీ బాద్యత తక్కువవుతుంది. చిన్న ఆదాయం ఉన్న మహిళలు కూడా తక్కువ EMIతో ఇల్లు కొనుగోలు చేయగలుగుతారు. ఉదాహరణకు, మీరు రూ.15 లక్షల వరకు లోన్ తీసుకుంటే, PMAY కింద మీరు రూ.2 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. ఇది నేరుగా మీ రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది.
గృహ రుణం తీసుకున్నప్పుడు, మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షలు (ప్రిన్సిపల్ పై) Section 80C కింద మినహాయింపు పొందవచ్చు. అలాగే రూ.2 లక్షలు (వడ్డీపై) Section 24(b) కింద మినహాయింపు పొందవచ్చు. మీరు గృహ రుణం మీ భార్యతో కలిపి తీసుకుంటే, ఇద్దరికీ ఈ మినహాయింపు వేరుగా లభిస్తుంది. అంటే, కలిపి రూ.7 లక్షల వరకు ఆదాయపన్నులో మినహాయింపు పొందవచ్చు.