పెద్ద మొత్తంలో సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, SIP మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీన్ని సులభంగా సాధించవచ్చు. కేవలం ₹2,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించి దీర్ఘకాలంగా పెట్టుబడి చేస్తే, మీ రిటైర్మెంట్ భద్రతను పొందడమే కాకుండా కోటీశ్వరులు కూడా కావొచ్చు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 10/35/12 ఫార్ములా పాటించాలి. దీని ద్వారా ₹3 కోట్లు సంపాదించడం పూర్తిగా సాధ్యమే. మరి, ఈ అద్భుతమైన ఆర్థిక ఫార్ములా గురించి పూర్తిగా తెలుసుకుందాం.
₹3 కోట్లు సంపాదించే 10/35/12 ఫార్ములా ఏమిటి?
ఈ ఫార్ములా 10/35/12 అంటే ఏమిటంటే:
- 10% టాప్-అప్: ప్రతి సంవత్సరం మీరు పెట్టే మొత్తాన్ని 10% పెంచాలి.
- 35 సంవత్సరాలు నిరంతరంగా SIP చేయాలి.
- సగటు రాబడి 12% ఉంటుందని అంచనా వేయాలి.
ఈ విధానం ద్వారా డబ్బు ఎలా పెరుగుతుంది?
- మీరు 25 ఏళ్ల వయస్సులో SIP ప్రారంభించారని ఊహించుకుందాం.
- మొదట ₹2,000 నెలకు పెట్టుబడి పెడతారు.
- ఏడాది తర్వాత 10% టాప్-అప్ అంటే ₹200 పెంచి ₹2,200 చేయాలి.
- రెండో ఏడాది ₹2,200 పై 10% పెంచి ₹2,420 చేయాలి.
- 35 ఏళ్లపాటు ఇదే విధంగా కొనసాగిస్తే, మీ మొత్తం పెట్టుబడి ₹65,04,585 అవుతుంది.
- ఈ మొత్తం సగటు 12% రాబడి సాధిస్తే, మీ లాభం ₹2.5 కోట్లు అవుతుంది.
- మొత్తం SIP విలువ ₹3.15 కోట్లు అవుతుంది
ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా కోటీశ్వరులు అవ్వచ్చు
- SIP అంటే చిన్న మొత్తాలతో పెద్ద సంపద నిర్మించుకునే అత్యుత్తమ మార్గం.
- కేవలం ₹2,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, సంవత్సరానికి 10% పెంచుకుంటూ పోతే… మీకు భవిష్యత్తులో కోటీశ్వరులు కావడం ఖాయం…
- ఇది పూర్తిగా లాంగ్ టర్మ్ ఫ్లాన్ కావడంతో పేషెన్స్ & డిసిప్లిన్ తప్పనిసరి.
- SIP లాంగ్ టర్మ్ వృద్ధి రేటు సగటున 12% ఉండే అవకాశం ఉంది.
- అయితే, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ముప్పులకు లోనవుతాయి, కనుక మీ ఆర్థిక స్థితిని అంచనా వేసి పెట్టుబడి చేయడం మంచిది.
ఇప్పుడే ప్రారంభించాలి
మీరు త్వరగా ప్రారంభిస్తే, రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది.
Related News
- 25 ఏళ్లకే ప్రారంభిస్తే ₹3 కోట్లు సంపాదించవచ్చు.
- కానీ 30 లేదా 35 ఏళ్లకు ప్రారంభిస్తే లాభం తక్కువగా ఉండొచ్చు.
- అందుకే, ఒకే రోజు కాదు – మొదటినుంచి ప్లాన్ చేస్తేనే కోటీశ్వరులు అవ్వగలం…
మీ భవిష్యత్తును భద్రపరచుకోవాలంటే ఆలస్యం వద్దు. SIP ద్వారా డబ్బు ఎలా పెరుగుతుందో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది. ఇప్పుడే మొదలు పెట్టండి – భవిష్యత్తులో కోటీశ్వరులు కాబోతుంది మీరే.