ఇప్పటి రోజుల్లో ప్రతి చిన్న పెద్ద అవసరానికి బ్యాంకుల ద్వారా లోన్లు అందుబాటులో ఉన్నాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, కారు లోన్ ఇలా ఎన్నో రకాల లోన్లు మన భారాన్ని తక్కువ చేస్తాయి. కానీ, లోన్ అనేది అప్పుడే బాగుంటుంది, మీరు తక్కువ వడ్డీకి, సులభమైన ఈఎంఐకి పొందితేనే. అదే ఒక మంచి ఆర్థిక నిర్ణయం అవుతుంది.
ఇలాంటి సందర్భంలో జాయింట్ లోన్ అనే ఆప్షన్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ముఖ్యంగా మీరు ఒక మహిళతో కలిసి లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. ఇందులోని గల అద్భుతమైన లాభాలను ఈ ఆర్టికల్‌లో పూర్తిగా వివరించబోతున్నాం. మీరు ముందు చదివి ఆలోచించి, ఆ తర్వాతే ఏ లోన్ అయినా తీసుకోండి.
జాయింట్ లోన్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే లోన్‌కి అప్లై చేయడం. సాధారణంగా భార్యాభర్తలు, తల్లి కొడుకు, సోదరులు, తండ్రి కూతురు ఇలా కుటుంబ సభ్యులు ఈ విధంగా కలిసి లోన్ తీసుకుంటారు. ఇందులో repayment బాధ్యత ఇద్దరిపై ఉంటుంది. ఈ విధంగా కలిసి తీసుకున్న లోన్ మీరు ఒంటరిగా తీసుకునే లోన్ కంటే చాలా బలమైన ఆర్థిక ఆధారంగా మారుతుంది.
మీరు ఒకరి పేరుతో లోన్ తీసుకుంటే బ్యాంక్ మీ ఆదాయాన్ని మాత్రమే చూసి ఓ పరిమిత రేంజ్ లో మాత్రమే లోన్ ఇస్తుంది. కానీ ఇద్దరూ కలసి అప్లై చేస్తే, వారి ఇద్దరి ఆదాయాన్ని కలిపి చూస్తుంది. ఫలితంగా మీకు ఇచ్చే లోన్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇంటిని కొనాలనుకున్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా, ఈ విధంగా కలసి తీసుకునే లోన్ ద్వారా మీరు మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.
ఇది జాయింట్ లోన్ తీసుకునే వాళ్లకు వచ్చే పెద్ద ప్రయోజనం. ముఖ్యంగా మీరు ఒక మహిళతో కలసి హోమ్ లోన్ తీసుకుంటే, బ్యాంకులు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తాయి. కొన్ని బ్యాంకులు మహిళలకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇది ప్రభుత్వ మహిళ సాధికారత కార్యక్రమాల లో భాగం. అలా తీసుకున్న లోన్‌తో మీరు కొన్ని లక్షల రూపాయల వడ్డీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
వడ్డీ రేటు తక్కువగా ఉండటం వల్ల ఈఎంఐ కూడా తక్కువ అవుతుంది. అందులోనూ ఇద్దరూ కలిపి ఈఎంఐ చెల్లిస్తే ప్రతి ఒక్కరిపై వచ్చే భారం చాలా తక్కువగా ఉంటుంది. మీరు నెలసరి ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. అలాగే పొదుపు కూడా పెరుగుతుంది. మిగతా ఆర్థిక లక్ష్యాల కోసం డబ్బును సజావుగా దాచుకోగలుగుతారు.
జాయింట్ లోన్ తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉంటే ఇద్దరి క్రెడిట్ స్కోర్ కూడా మెరుగవుతుంది. మీరు కొంచెం తక్కువ స్కోర్ ఉన్నవారైనా, మీతో ఉన్న వ్యక్తి మంచి స్కోర్ కలిగి ఉంటే లోన్‌కి అంగీకారం రావడం సులభమవుతుంది. repayment పద్దతి బాగా ఉంటే, భవిష్యత్తులో మరో లోన్ తీసుకునేటప్పుడు కూడా తక్కువ వడ్డీకి పొందే అవకాశం ఉంటుంది. ఇది మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ను మెరుగుపరుస్తుంది.
జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరూ Income Tax చట్టం ప్రకారం వేరువేరు టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ రిపేమెంట్ పై డిడక్షన్, సెక్షన్ 24(b) కింద వడ్డీపై డిడక్షన్ రెండింటినీ ఇద్దరూ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఒక షరతు – ఆ ప్రాపర్టీ ఇద్దరి పేర్లలో ఉండాలి. అలాగే లోన్ రిపేమెంట్కి ఇద్దరూ వాటా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ టాక్స్ బుర్డెన్ తగ్గుతుంది. అదే సమయంలో మీ నెట్ పొదుపు పెరుగుతుంది.
జాయింట్ లోన్ అనేది మీ ఆర్థిక భవిష్యత్తుకు మంచి శుభారంభం. ఇది ఒకటిగా ఉన్న కుటుంబాలకు, ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరాలనుకునేవారికి ఒక బలమైన మార్గం. తక్కువ వడ్డీ, EMI లో తగ్గింపు, టాక్స్ బెనిఫిట్స్, క్రెడిట్ స్కోర్ మెరుగుదల – ఇవన్నీ కలిపి చూస్తే జాయింట్ లోన్ అనేది ఒక మల్టీ బెనిఫిట్ ఆఫర్ లాంటిదే. ఒకమాటలో చెప్పాలంటే, ఒంటరిగా కాదు, కలిసే గెలవచ్చు! మరి ఆలస్యం ఎందుకు? సరైన భాగస్వామిని ఎంచుకుని జాయింట్ లోన్ ప్రయోజనాలను మీ జీవితంలోకి తీసుకురండి.