
మీరు కొత్తగా మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చదవకుండా మిస్ అవ్వొద్దు! ఇప్పటి వరకు మీరు చూసిన ఫోన్లతో ఇది చాలా తేడాగా ఉంటుంది. Lava సంస్థ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన Lava Agni 3 5G ఫోన్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే… దీని ముందు, వెనుక రెండూ స్క్రీన్లు ఉన్నాయి. అవును! ముందు ఒక పెద్ద 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. వెనక మరో చిన్న 1.74 అంగుళాల AMOLED టచ్ స్క్రీన్ ఉంది.
ఈ వెనుకటి స్క్రీన్ వలన మీరు ఫోన్ తిప్పకుండా మెసేజ్‌లకు త్వరగా రిప్లై ఇవ్వొచ్చు, కాల్స్ తీసుకోవచ్చు, మ్యూజిక్‌ను కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా వెనుక కెమెరాతో సులభంగా సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు.
ఈ ఫోన్లో 4nm MediaTek Dimensity 7300X ప్రాసెసర్ ఉంది. ఇది పవర్‌ఫుల్‌గానూ, ఎనర్జీ ఎఫిషియెంట్గానూ పనిచేస్తుంది. 8GB LPDDR5 RAM మరియు వర్చువల్ RAM సపోర్ట్ ఉంటుంది. 256GB వరకు ఫాస్ట్ స్టోరేజ్ (UFS 3.1) తో వస్తుంది.
[news_related_post]ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది – 50MP ప్రైమరీ కెమెరా (OIS తో), 8MP అల్ట్రావైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా. ఫ్రంట్ కెమెరా 16MP ఉంటుంది. ఫోటోలు, వీడియోలు క్వాలిటీ టాప్ క్లాస్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు! ఐఫోన్లా యాక్షన్ బటన్ కూడా ఉంది. దీన్ని మనం మనిషి అవసరానికి తగ్గట్టుగా సెటప్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, సైలెంట్ మోడ్, రింగ్ మోడ్ వంటి వాటికి ఉపయోగించవచ్చు.
5000mAh బ్యాటరీతో 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్ల వల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. Wi-Fi 6E, Bluetooth 5.4, 5G వంటి అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇంతటి ఫీచర్లతో కూడా ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.16,999కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువకు దొరకొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అలాంటి ప్రత్యేకమైన Lava Agni 3 5G ఫోన్‌ను ఇప్పుడు మిస్ అవకండి! ఇవే ఆఖరి స్టాక్‌లు కావచ్చు!