ఎందుకు రిజెక్ట్ అవుతున్నారో తెలుసా?.. EPFO రిజెక్షన్ వెనుక షాకింగ్ నిజాలు…

దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న EPFO హయ్యర్ పెన్షన్ పథకం ఇప్పుడు నిరాశగా మారుతోంది. ఎందుకంటే చాలా మందివి దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. మరింత దురదృష్టకరం ఏంటంటే, ఒక్కసారి రిజెక్ట్ అయితే మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగి కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆ ఉద్యోగి EPFO ద్వారా హయ్యర్ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు పెండింగ్‌లో పెట్టిన తర్వాత, ఎటువంటి స్పష్టత లేకుండా దానిని తిరస్కరించారు. ఆ తర్వాత విచారణలో తేలిందేమంటే, ఆయన పని చేస్తున్న కంపెనీ EPFO అడిగిన పూర్తి సమాచారం ఇవ్వకపోవడం వల్లే దరఖాస్తు తిరస్కరణ జరిగింది. తర్వాత EPFO అధికారులు “మేము ఇక చేసేదేమీ లేదు” అని చెప్పడం, ఆయన్ను బెంబేలెత్తించేసింది.

ఇలాంటి ఘటనలు ఒకటే కాదు. తెలంగాణలోనే 1.65 లక్షల దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌లో 57,000 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. దేశవ్యాప్తంగా చూస్తే, 17.49 లక్షల దరఖాస్తుల్లో 7.35 లక్షలు రిజెక్ట్ చేయబడ్డాయి. రిజెక్ట్ చేసే సమయంలో చిన్న చిన్న టెక్నికల్ లోపాలు చూపించడం EPFO యొక్క ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Related News

EPFO అభ్యర్థుల నుంచి Form 3A, Form 6A ఛాలన్‌లు అడుగుతుంది. ఇవి 1995 నుంచి 2009 వరకు ఉద్యోగి EPF వాటాను రుజువు చేయాల్సిన పత్రాలు. కానీ ఉద్యోగులు మాత్రం, “ఇవన్నీ కంపెనీ వాల్ల బాధ్యత, మేము ఎలా సమర్పించగలం?” అని. అసలు కంపెనీ కారణంగా తప్పు జరిగితే, ఉద్యోగిని శిక్షించడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 1,800 మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. వారు రూ.410 కోట్లు EPS బకాయిలు చెల్లించినా, EPFO నిబంధనల కారణంగా హయ్యర్ పెన్షన్ దక్కలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు కూడా అలాంటి న్యాయం కోరుతున్నారు.

సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ సభ్యుడు సుంకరి మల్లేశం ఈ విషయాన్ని మార్చి 27న జరిగిన బోర్డ్ సమావేశంలో లేవనెత్తారు. EPFO అధికారులు కేంద్ర ఆదేశాల ప్రకారం మాత్రమే పని చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఆయన త్వరలో జరగబోయే సమావేశాల్లో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.

ఇకనైనా అప్రమత్తమై రూ.5,000 పెట్టుబడి ద్వారా భవిష్యత్‌లో వచ్చే రూ.40,000 పెన్షన్ కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలి. EPFO తప్పిదాల వల్ల ఉద్యోగులు తమ హక్కులు కోల్పోవద్దని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది.