SBI: డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోన్న బ్యాంక్… రూ.1 లక్ష పెట్టి రూ.24,604 లాభం…

ఇప్పటి కాలంలో భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలంటే మంచి పొదుపు తప్పనిసరి. మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టే బెస్ట్ అవకాశం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా వచ్చింది. ఈ మధ్యే RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దాంతో దేశంలోని అన్ని బ్యాంకులు రుణ వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI కూడా FD వడ్డీ రేట్లు తగ్గించింది

ఈ క్రమంలో SBI కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. సాధారణంగా డిపాజిట్ పథకాలపై వడ్డీ తగ్గితే, లాభం తక్కువవుతుంది. కానీ SBI FD పథకాలలో ఇంకా మంచి వడ్డీ శాతం అందుతోంది. ఈ రోజుల్లో రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునేవారికి ఇది గోల్డ్ ఛాన్స్ అనే చెప్పాలి.

ఇప్పటికీ మంచి వడ్డీ శాతం ఇస్తున్న SBI

ప్రస్తుతం SBI సాధారణ ఖాతాదారులకు 3.50 శాతం నుంచి 7.05 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. గతంలో ఇది 3.50 శాతం నుంచి 7.25 శాతం ఉండేది. ఇక 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రం 4.00 శాతం నుంచి 7.55 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఇది ముందు 7.75 శాతం వరకు ఉండేది. అంటే వృద్ధులకు కాస్త ఎక్కువ వడ్డీ అందుతోంది.

Related News

2 నుండి 3 సంవత్సరాల FDపై బంపరాఫర్

2 నుంచి 3 సంవత్సరాల FD పథకంలో ప్రస్తుతం సాధారణ ఖాతాదారులకు 6.90 శాతం వడ్డీ ఇస్తున్నారు. వృద్ధులకు అయితే ఇది 7.40 శాతం. గతంలో ఇది సాధారణ వారికి 7.00 శాతం, వృద్ధులకు 7.50 శాతం ఉండేది. అంటే 0.10 శాతం తగ్గినా, వడ్డీ శాతం ఇంకా ఆకర్షణీయంగా ఉంది.

రూ.1 లక్ష పెట్టిన వారికి ఎంత లాభం అంటే?

మీ వయస్సు 60 ఏళ్లు లోపైతే, అంటే మీరు సాధారణ ఖాతాదారులు అయితే, రూ.1 లక్షను SBIలో 3 ఏళ్ల FDగా పెట్టినట్లయితే మొత్తంగా రూ.1,22,781 లభిస్తుంది. ఇందులో రూ.22,781 లాభం ఉంటుంది. అదే మీరు వృద్ధులైతే, అంటే 60 ఏళ్లు పైబడిన వారు అయితే, మీరు రూ.1 లక్ష FDగా పెడితే, మీ maturity మొత్తం రూ.1,24,604 అవుతుంది. అంటే నికర వడ్డీ మొత్తం రూ.24,604.

అంటే రిస్క్ లేకుండా మంచి లాభం

ఇప్పటి మార్కెట్ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు వడ్డీ తగ్గుతూ వస్తున్నా, SBIలో మాత్రం ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకి ఇది ఓ గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. డబ్బును సురక్షితంగా ఉంచుకునే వాళ్లు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతూ ఉండడం వల్ల, ఈ స్థాయిలో లాభం పొందే అవకాశం చాలా అరుదు. పైగా గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి భద్రతపై నమ్మకం ఉంటుంది. కనుక మీరు కూడా పొదుపు చేయాలనుకుంటే, ఇప్పుడే SBI బ్రాంచ్‌కు వెళ్లండి లేదా ఆన్‌లైన్‌లోనే FD తెరవండి. 3 ఏళ్లకు రూ.1 లక్ష FD పెట్టి, రూ.24,604 లాభం పొందే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ కాకండి.

గమనిక: మీరు ఎలాంటి పెట్టుబడి వేయాలన్నా, పూర్తి సమాచారం తెలుసుకుని, మీ బాధ్యతపై మాత్రమే పెట్టుబడి పెట్టండి.