
TVS కంపెనీ నుంచి వచ్చిన కొత్త రైడర్ 125 మోడల్ ఇప్పుడు 125cc సెగ్మెంట్లో కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తోంది. ఈ బైక్ చూసినవాళ్లంతా ఒకే మాట చెబుతున్నారు – “ఇంత స్పోర్టీ లుక్‌కి ఇంత మైలేజ్ ఉందా?”. అయితే నిజంగా ఇది అంత బాగుందా? ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఫీచర్లను పూర్తిగా పరిశీలిద్దాం.
ఈ బైక్‌లో 124.8cc ఇంజిన్ ఉంటుంది. ఇది 11.2 హెచ్‌పీ పవర్, 11.2 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. అంటే ఒక చిన్న బైక్‌కి ఇది చాలా మంచి పికప్. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం వచ్చేందుకు కేవలం 5.9 సెకన్లు మాత్రమే పడుతుంది. ఇది 125cc సెగ్మెంట్లో బెస్ట్ యాక్సిలరేషన్ అని చెప్పాలి. ఇంకా ఇందులో iGO టెక్నాలజీ ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్‌లో సాఫీగా డ్రైవ్ చేయొచ్చు. సిగ్నల్స్ దగ్గర ఎక్కువ పెట్రోల్ వృథా కాకుండా ఉంటుంది.
పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్న ఈ రోజుల్లో మైలేజ్ ఎంత ఇస్తుందో అన్నది కీలకం. ఈ బైక్ 71.94 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. యూజర్లు పంచుకున్న రిపోర్ట్స్ ప్రకారం 65-68 kmpl వరకు రావడం సాధ్యమవుతుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అంటే ఒకసారి ఫుల్ చేసుకుంటే సుమారు 700 కిలోమీటర్ల ప్రయాణం సులభంగా చేయవచ్చు. ఇది రోజూ క్యూటీలోనూ, లాంగ్ రైడ్స్‌లోనూ సూపర్‌గా ఉంటుంది.
[news_related_post]ఈ బైక్‌లో వస్తున్న ఫీచర్లు చూస్తే మీరు షాక్ అవుతారు. ఇందులో SmartXonnect టెక్నాలజీ ఉంటుంది. దీనివల్ల మీరు మొబైల్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో 85కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. TFT డిస్ప్లే (SX వెర్షన్లో) వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. దీనివల్ల మీరు నావిగేషన్, కాల్ అలర్ట్స్ లాంటివన్నీ స్క్రీన్ మీదే చూడొచ్చు. Glide Through టెక్నాలజీ వల్ల ట్రాఫిక్‌లో సాఫీగా బైక్ నడవుతుంది.
బైక్‌కు ముందు భాగంలో షార్ప్ LED DRLs ఉంటాయి. ట్యాంక్ డిజైన్ కూడా మస్క్యులర్‌గా ఉంటుంది. మ్యాట్ బ్లూ, రెసింగ్ రెడ్ లాంటి 5 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇంకా స్ప్లిట్ సీటు సెటప్ వల్ల ఈ బైక్ స్పోర్టీగా కనిపిస్తుంది. కమీటర్ బైక్ అయినా స్పోర్ట్స్ ఫీల్ కలిగిస్తుంది. ఈ బైక్‌కి ధర ₹87,010 నుండి ₹1,03,150 వరకు ఉంటుంది (ex-showroom). ఇది పోటీగా ఉన్న Honda SP 125, Bajaj Pulsar 125 లకు కష్టమిచ్చే ధర. TVS రైడర్‌ను చూసిన తర్వాత వాళ్లన్నీ దీనిపైనే ఫిక్స్ అవుతున్నారు. ఈ ధరకి ఇంత టెక్నాలజీ, ఇంత మైలేజ్ అందే బైక్ మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. TVS కంపెనీ ట్రస్ట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది దీనిపైనే మొగ్గు చూపుతున్నారు.
మీరు ఒక కళాశాల విద్యార్థి అయితే స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. ఆఫీసు వెళ్లే ఉద్యోగులు అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ దక్కుతుంది. మీరు ఫస్ట్ టైం బైక్ కొనుగోలు చేస్తున్నా సరే ఇది ప్రీమియం ఫీల్ ఇవ్వగల 125cc క్లాస్ బైక్. ఈ బైక్ అతిగా వేగంగా నడిపినప్పుడు కొంత వైబ్రేషన్ వస్తుంది – కానీ ఇది 125cc బైక్స్‌కి కామన్. TFT డిస్ప్లే మాత్రమే టాప్ వెర్షన్లో వస్తుంది. కానీ సర్వీస్ ఖర్చు తక్కువగా ఉంటుంది – ప్రతి సర్వీసుకు సుమారు ₹1200 నుండి ₹1500లోపే ఖర్చవుతుంది.
TVS Raider 125 2025 మోడల్ నిజంగా ఒక గేమ్ ఛేంజర్. ఇది స్పోర్ట్స్ లుక్, అధ్బుతమైన మైలేజ్, ఫీచర్లతో కొత్త జనరేషన్ బైక్‌గా నిలుస్తోంది. మీరు ₹87,000కి మంచి బైక్ వెతుకుతున్నారా? అయితే Raider 125 మిస్ అయితే నిజంగా మీరు లాస్లో పడతారు.