
వివో ఫ్యాన్స్‌కి మంచి న్యూస్. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రెండు భారీ ఫోన్లు భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఇవి వివో X200 FE, వివో X ఫోల్డ్ 5. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఈ ఫోన్లు ఇప్పుడు భారత్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రెండు మోడల్స్‌లో specs ముందే బయటికి వచ్చేశాయి. అఫిషియల్ సేల్, ఆఫర్లు లాంచ్ సమయానికే వెల్లడి కానుంది.
మొదటగా వివో X200 FE గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ అత్యంత పవర్ఫుల్ 9300+ డైమెన్సిటీ మీడియాటెక్ చిప్సెట్తో వస్తోంది. దీనికి 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సపోర్ట్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించిన Funtouch OS 15పై ఈ ఫోన్ పని చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే, 6.31 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బరువు కేవలం 186 గ్రాములే.
బ్యాటరీ విషయానికి వస్తే, 6000ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీతో వస్తోంది. అదనంగా 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. కెమెరా సెక్షన్లో Zeiss భాగస్వామ్యంతో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 సర్టిఫికేషన్లతో వస్తోంది. మోడర్న్ లుక్, పవర్‌పుల్ ఫీచర్లతో ఫోన్ ఓ బీస్ట్ లా మారింది.
[news_related_post]వివో X200 FE ధర రూ.54999గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ, బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.49999కి కూడా దొరుకుతుంది. స్టోరేజ్ విషయంలో 12GB/256GB, 16GB/512GB వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం.
ఇక రెండో ఫోన్ వివో X ఫోల్డ్ 5. ఇది రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది. ఇందులో 8.03 అంగుళాల 2K+ LTPO అమోలెడ్ ప్రైమరీ డిస్ప్లే, 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ కవర్ డిస్ప్లే ఉంది. పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్, Adreno 750 GPU కూడా ఇందులో ఉన్నాయి.
కెమెరాలు కూడా మామూలుగా లేవు. 50MP సోనీ IMX921 ప్రైమరీ, 50MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అలాగే 6000mAh బ్యాటరీతో పాటు 80W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.