
జూలై మొదటి తారీఖు వచ్చింది అంటే కొత్త నెల ప్రారంభమైంది. అలాగే కొత్త నిబంధనలూ ప్రారంభమయ్యాయి. ఈ నెలలో బ్యాంకులపై, ముఖ్యంగా HDFC మరియు ICICI బ్యాంకులపై కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు కొన్ని కస్టమర్లకు ఊరటను ఇవ్వగా, మరికొన్ని మార్పులు మాత్రం షాక్‌లా మారాయి.
ఈ మార్పుల్లో ముఖ్యంగా క్రెడిట్ కార్డు యూజర్లకు హెచ్చరిక అవసరం. దేశంలో అగ్రగామిగా ఉన్న HDFC బ్యాంకు తమ క్రెడిట్ కార్డు నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇక మీదట కొన్ని తరహా లావాదేవీలపై 1 శాతం అదనపు ఛార్జీ విధించనున్నారు. అదే విధంగా ICICI బ్యాంకు ATM చార్జీలపై కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మీ ఖర్చులపై మరింత జాగ్రత్త అవసరం.
ఇప్పటి వరకు మనలో చాలామంది PayTM, PhonePe, Mobikwik లాంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా HDFC క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు చేస్తూ వచ్చారు. అయితే ఇక మీదట ఇదే పని చేస్తే మీరు 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ₹10,000 వరకు చెల్లిస్తే నిబంధనల పరంగా సులభంగా జరుగుతుంది. కానీ అది మించితే ఆ మిగిలిన మొత్తంపై 1 శాతం అదనపు ఛార్జీ పడుతుంది.
[news_related_post]ఇది డ్రీమ్ 11, MPL, జంగ్లీ గేమ్స్, రమ్మీ కల్చర్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపైనా వర్తిస్తుంది. అంటే మీరు జూలై 1 నుండి ఇలాంటి సైట్లపై ₹10,000కు మించిన లావాదేవీలు చేస్తే, అదనపు ఛార్జీ తప్పదు.
అదే విధంగా PayTM, Mobikwik, Freecharge, Ola Money లాంటి డిజిటల్ వాలెట్లలో ఒక నెలలో ₹10,000కి పైగా యాడ్ చేస్తే, ఆ మించి వేసే మొత్తంపై కూడా 1 శాతం అదనంగా వసూలు చేస్తారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్ యూజర్లపై నేరుగా భారం పడనుంది.
ఇక ICICI బ్యాంక్ కూడా జూలై 1 నుండి కొత్త ATM నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ మామూలుగా ATM వాడటం ఉచితమే అనుకునేవారు జాగ్రత్తగా వినాలి. కొత్త నిబంధనల ప్రకారం, మీరు మీ ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితిని మించిపోయితే, ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 చొప్పున ఛార్జీ వేయనున్నారు.
ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకి మాత్రమే కాకుండా, మీరు కేవలం బ్యాలెన్స్ చెక్ చేసినా, లేదా నాన్-ఫైనాన్షియల్ పనుల కోసం ATM వాడినా రూ.8.50 చొప్పున ఛార్జీ వేయనున్నారు.
మెట్రో నగరాల్లో అయితే ఉచితంగా కేవలం 3 ట్రాన్సాక్షన్లకే పరిమితం. మిగతా చోట్ల 5 ట్రాన్సాక్షన్ల వరకే ఉచితం. అంటే ఇప్పుడు ATM వినియోగదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ కొత్త మార్పులతో మనకు చిన్న చిన్న లావాదేవీలకే అదనపు ఖర్చులు పడే పరిస్థితి ఉంది. మీ క్రెడిట్ కార్డు వాడకం, వాలెట్ యాడ్లిమిట్, ATM వాడకం అన్ని మీద పూర్తి కంట్రోల్ ఉండాలి. నెలవారీగా మీ ఖర్చులను వివేకంగా ప్లాన్ చేసుకోవాలి.
బ్యాంకులు యూజర్లకు షాక్ ఇచ్చినా, నిబంధనలు స్పష్టంగా ప్రకటించాయి. అందుకే ఇకనైనా మనం మన ఖర్చులు తగిన రీతిలో ప్లాన్ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా రోజూ పేమెంట్ యాప్‌లను ఎక్కువగా వాడే వారికి ఇది అతి ముఖ్యమైన సమాచారంగా చెప్పవచ్చు.
ఇకపై మీరు చేయబోయే ప్రతి లావాదేవీకి ముందు ఛార్జీలు ఉంటాయా? అనేది ముందే తెలుసుకోండి. లేకపోతే చిన్న నిధులకే పెద్ద మొత్తాల్లో డెడక్షన్ జరగవచ్చు.
HDFC క్రెడిట్ కార్డు యూజర్లకు – ₹10,000 మించితే 1% ఛార్జీ
ICICI బ్యాంక్ ATM – ఉచిత పరిమితి మించితే ₹23 ఛార్జీ
బ్యాలెన్స్ చెకింగ్ కూడా ₹8.50 చార్జీతో… ఈ మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇప్పుడు నుంచే జాగ్రత్తలు పాటించండి. ఆలస్యం అయితే మీ ఖాతాలోని డబ్బే వృథా అవుతుంది…