
Xiaomi అభిమానులకు ఒక పెద్ద గుడ్‌న్యూస్ వచ్చేసింది. Xiaomi కంపెనీ హై నుంచి నెంబర్ సిరీస్‌లో వచ్చే జనరేషన్ మోడల్స్‌పై పలు లీకులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు అందరికీ Xiaomi 16, Xiaomi 16 Pro, Xiaomi 16 Ultra గురించి మాత్రమే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా మరో మోడల్ కూడా లీక్ అయ్యింది. అదేనండీ.. Xiaomi 16 Pro Max. ఇది Xiaomi అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది. ఎందుకంటే ఇందులో వచ్చే బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్లోనూ ముందెన్నడూ చూడలేదు.
లీక్ అయిన సమాచారం ప్రకారం, Xiaomi 16 Pro Max ఫోన్లో 7,290mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మార్కెట్లో 7,500mAh మోడల్‌గా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ Xiaomi 16 Ultra కన్నా పెద్దదిగా ఉండబోతోంది. అందరూ Xiaomi 16 Ultra కే ఫినిషింగ్ టచ్ అనుకున్నారు. కానీ Xiaomi 16 Pro Max మరింత పవర్‌ఫుల్‌గా వస్తోంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అనే ప్రముఖ లీక్ సోర్స్ ఈ సమాచారాన్ని చైనాలోని వీబో అనే ప్లాట్ఫామ్లో పంచుకున్నాడు.
Xiaomi 16 Ultra ఫోన్లో భారీ కెమెరా మాడ్యూల్ ఉండే అవకాశముంది. అదే కారణంగా దాని బ్యాటరీ 7,000mAh వద్దే ఆగిపోవచ్చని అంటున్నారు. కానీ Xiaomi 16 Pro Max మాత్రం పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీతో వస్తూ షాక్ ఇస్తోంది. భారీ usage ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
[news_related_post]Xiaomi 16 సిరీస్‌లో వచ్చే అన్ని ఫోన్లు Qualcomm Snapdragon 8 Gen 4 (Elite 2) చిప్సెట్తో వస్తాయనే నమ్మకం ఉంది. ఇది అక్టోబర్ నెలలో అధికారికంగా లాంచ్ అవుతుంది. ఈ చిప్సెట్తో ఫోన్ యొక్క గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వేగవంతమైన యూజ్ అనుభవం కావాలంటే ఈ ఫోన్‌ను మిస్ కాకూడదు.
Xiaomi 16 Pro Max లో కెమెరా విషయంలో పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ ఉండనుంది. ప్రస్తుత లీకుల ప్రకారం, ఈ ఫోన్లో బ్యాక్ డిస్ప్లే కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫోన్‌ను తిప్పి చూసినా, సమాచారం నేరుగా కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన లుక్‌నే కాదు, పనితీరు పరంగా కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది.
Xiaomi 16 సిరీస్‌ను 2025 చివరలో మార్కెట్లోకి తీసుకురావాలని Xiaomi కంపెనీ ప్లాన్ చేస్తోంది. ముందుగా Xiaomi 16, Xiaomi 16 Pro ఫోన్లు లాంచ్ అవుతాయి. ఆ తర్వాత Xiaomi 16 Ultra మరియు కొత్తగా చేరే Xiaomi 16 Pro Max మార్కెట్లోకి రావచ్చు. అంటే ఈ ఫోన్ల కోసం ఎగ్జైట్‌గా ఎదురు చూసే టైం వచ్చేసింది.
ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధర రూ. 59,000 నుండి రూ. 65,000 వరకు ఉండే అవకాశం ఉంది. కానీ దాని ఫీచర్లు చూస్తే ఈ ధర నిజంగా న్యాయంగా అనిపించకుండా ఉండదు. 7500mAh బ్యాటరీ, లేటెస్ట్ Snapdragon 8 Gen 4 ప్రాసెసర్, ప్రీమియం డిజైన్, మల్టీ కెమెరా సెటప్, బ్యాక్ డిస్ప్లే – ఇవన్నీ కలిస్తే ఇది 2025లోని బెస్ట్ ఫోన్ అయిపోవడం ఖాయం.
ఇది చూడగానే “ఈ ఫోన్ తీసుకోవాల్సిందే” అనే ఫీలింగ్ వస్తోంది కదూ! Xiaomi 16 Pro Max ఫోన్‌కి వచ్చే రోజుల్లో వేట జరుగుతుంది అని టాక్. 7500mAh బ్యాటరీతో ఇది ఒక పవర్ బ్యాంక్ లాంటి ఫోన్ అని చెప్పొచ్చు. గేమింగ్, ఫోటోగ్రఫీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలంటే, ఇది మిస్ అయితే చాలు.. తర్వాత హ్యాండ్స్‌లో దొరకకపోవచ్చు.