
Redmi మరోసారి మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. Xiaomi సబ్‌బ్రాండ్ అయిన Redmi, ఇప్పుడు “Turbo 5” సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో రెండు మోడల్స్ ఉండబోతున్నాయి – Redmi Turbo 5 మరియు Turbo 5 Pro. ఈ రెండు ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నాయని లీక్స్ చెబుతున్నాయి.
ఇప్పటికే Turbo 5 Pro గురించి చాలా సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఫేమస్ టిప్‌స్టర్ Digital Chat Station కొత్తగా Turbo 5 ఫోన్ గురించి కూడా కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ఈ ఫోన్లు మొదట చైనాలో రిలీజ్ అవుతాయని సమాచారం. అయితే ఇతర దేశాల్లో ఇవే Poco బ్రాండ్ పేరుతో వస్తాయని ఊహిస్తున్నారు. అంటే Turbo 5 మన దేశంలో Poco X8 Proగా, Turbo 5 Pro మోడల్ Poco F8గా విడుదలయ్యే అవకాశముంది.
Turbo 5 ఫోన్లో పెద్ద 6.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది ఇండస్ట్రీలో ఉన్న అత్యుత్తమ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందట. స్క్రీన్ రెసల్యూషన్ కూడా 1.5K అంటే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ‘లార్జ్ R-ఆంగిల్’ డిజైన్‌ను ఇందులో ఉపయోగించే అవకాశముంది. అంటే ఫోన్ స్క్రీన్ అంచులు మరింత మృదువుగా, వంపుగా ఉండేలా కనిపించవచ్చు. ఇది చూడటానికి మాత్రమే కాదు, పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. గతంలో వచ్చిన Turbo 4లో 6.67 అంగుళాల స్క్రీన్ ఉంది. కాబట్టి ఈ Turbo 5 స్క్రీన్ కొంచెం చిన్నదైనా, ఎర్గనామిక్ డిజైన్ కారణంగా ఫీల్ మాత్రం ఇంకా బెటర్‌గా ఉంటుందన్నది లీక్ సమాచారం. అంటే చేతిలో సౌకర్యంగా పట్టుకోవచ్చు.
[news_related_post]Turbo 5లో మేటల్ కీ ఫ్రేమ్ ఉపయోగిస్తారని సమాచారం. ఇప్పటి వరకు Redmi మోడల్స్‌లో ప్లాస్టిక్ ఫ్రేమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఫోన్ లుక్‌ను మరింత ప్రీమియంగా, స్టైలిష్‌గా చేయడానికి మేటల్ ఫ్రేమ్ ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల ఫోన్ స్టర్డీగానూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
Turbo 4 మోడల్లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6550mAh బ్యాటరీ ఉంది. Turbo 5లో మాత్రం స్లిమ్ డిజైన్ ఉన్నప్పటికీ, బ్యాటరీ పరిమాణం ఇంకా ఎక్కువగా ఉండబోతుందని టిప్స్టర్లు చెబుతున్నారు. అంటే ఈ ఫోన్ చూసేందుకు బరువు తక్కువగా, స్టైలిష్‌గా కనిపిస్తూనే, ఎక్కువ బ్యాకప్‌ను కూడా ఇస్తుంది. ఇది సాధారణంగా ఫ్లాగ్షిప్ ఫోన్లలో మాత్రమే కనిపించే ప్రత్యేకత.
Turbo 5 Pro ఫోన్ విషయానికి వస్తే, ఇది మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. టిప్స్టర్లు చెబుతున్నట్టు ఇది 8000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో రాబోతుందని సమాచారం. అంటే పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత ఈ ఫోన్ రెండు రోజులు స్మార్ట్‌గా పని చేయగలదు. ఇది ఎక్కువగా గేమింగ్ చేసే వారికి, ట్రావెలింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.
Turbo 5 Proలో ఉన్న ఫీచర్లు చూస్తే ఇది ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేలా ఉంటుందనే చెప్పొచ్చు. భారీ బ్యాటరీతో పాటు, మెటల్ బాడీ, మాస్ లుక్, అధునాతన ప్రాసెసర్, మంచి కెమెరాలు అన్నీ ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఇవన్నీ చైనాలో మొదట విడుదలవుతాయి. Turbo 5 Pro 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మార్కెట్లోకి రానుందట. Turbo 5 మోడల్ మాత్రం 2026 మొదట్లోనే రానుందని సమాచారం. ఇండియాలో ఇవే Poco బ్రాండ్ పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే Turbo 5 అంటే Poco X8 Pro, Turbo 5 Pro అంటే Poco F8 అన్న మాట.
లీకుల ప్రకారం, Turbo 5 (Poco X8 Pro) ఫోన్ ధర సుమారుగా రూ.23,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చు. Turbo 5 Pro (Poco F8) ధర మాత్రం రూ.30,000 నుంచి మొదలై వచ్చే అవకాశముంది. ఈ ధరలకు ఇలాంటి ఫీచర్లు వచ్చాయని నమ్మలేకపోతున్నారు టెక్ లవర్స్. అందుకే ఈ ఫోన్లు రాగానే వెంటనే బుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
Redmi Turbo 5 సిరీస్ అంటే శక్తివంతమైన బ్యాటరీ, క్లియర్ డిస్ప్లే, స్టైలిష్ డిజైన్ అన్నీ ఒకే ఫోన్లో. ఇది వచ్చేలోపే మనం మన బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ రాగానే మొదటి రోజునే సెల్ అవ్వడం ఖాయం. మీ చేతిలో బెస్ట్ ఫోన్ ఉండాలంటే ఇప్పుడు నుంచి రెడీ అవ్వండి…