ఇప్పటి వరకు మన Tax లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసు. పాత Slab ప్రకారం రూ.15 లక్షల ఆదాయానికి 30% టాక్స్ వర్తించేది. కానీ 2025 నుంచి కొత్త ట్యాక్స్ స్లాబ్‌లు ప్రవేశపెట్టారు. ఈ కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్‌లో 30% రేటు కేవలం రూ.24 లక్షల పైగా సంపాదించే వారికే వర్తిస్తుంది. అంటే మీ ఆదాయం రూ.18 లక్షలు అయితే ఇకపై మీరు 30% కాదు, తక్కువ రేటుతో టాక్స్ చెల్లించవచ్చు. ఇది ఎంతో మందికి బంపర్ గుడ్ న్యూస్.
రూ.3 లక్షల జీతం ఉంటే
కొత్త రెజీమ్‌లో టాక్స్ లెక్కించడంలో స్లాబ్‌లు స్పష్టంగా ఉన్నా చాలా మందికి క్లారిటీ లేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం రూ.0 నుంచి రూ.3 లక్షల వరకు ట్యాక్స్ లేదు. ఆ తర్వాతి రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల వరకు 5% ట్యాక్స్ ఉంటుంది. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10%, రూ.9 నుంచి రూ.12 లక్షల వరకు 15%, రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు 20%, ఇకపై రూ.15 లక్షలపైగా 30% ట్యాక్స్ వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఇది కూడా మారింది. 30% ట్యాక్స్ కేవలం రూ.24 లక్షల పైగా సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఏడాదికి రూ.18 లక్షల జీతం సంపాదిస్తున్నాడని అనుకుందాం. పాత ట్యాక్స్ విధానం ప్రకారం, అతను రూ.3.75 లక్షల వరకు టాక్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం అదే ఆదాయానికి అతను కేవలం రూ.3 లక్షల లోపలే ట్యాక్స్ చెల్లిస్తాడు. అంటే సుమారుగా రూ.75,000 డైరెక్ట్‌గా ఆదా అవుతుంది. ఇది చిన్న కార్ డౌన్ పేమెంట్‌కి సరిపోతుంది కదా
Related News
కొత్త టాక్స్ రెజీమ్‌లో
ఈ కొత్త ట్యాక్స్ విధానం వల్ల మధ్య తరగతి ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు ఎక్కువగా లాభపడతారు. పాత ట్యాక్స్ విధానం కంటే ఇది ఈజీ, క్లియర్ మరియు documentation తక్కువగా ఉంటుంది. మీరు LIC, 80C, HRA లాంటి డిడక్షన్లు ఎక్కువగా క్లెయిమ్ చేస్తే పాత విధానం మెరుగ్గా ఉండొచ్చు. కానీ మీ ఆదాయం స్థిరంగా ఉంటే, ఖర్చులు తక్కువగా ఉంటే, కొత్త విధానమే ఉత్తమం.
పూర్తిగా ఆప్షనల్
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఆప్షనల్ విధానం. మీరు పాత విధానాన్ని కొనసాగించాలనుకుంటే కొనసాగించవచ్చు. కానీ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సమయంలో ఏ విధానాన్ని ఎంచుకున్నారో స్పష్టంగా చెప్పాలి. ఒకసారి ఎంపిక చేసిన తర్వాత మార్చడం కాస్త కష్టమే.
ఈ కొత్త ట్యాక్స్ సిస్టమ్ వల్ల చాలామంది సుమారుగా రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ సారి మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే.. తర్వాత అసలు మిగలదు. మీ ఆదాయం ఎంత? మీ సేవింగ్స్ ఎంత? ఇవన్నీ బట్టి కొత్త రెజీమ్ ఎంచుకోవాలి. సరైన సమయంలో సరైన సెలక్షన్ చేస్తే మీరు ట్యాక్స్ లో పెద్ద మొత్తం డబ్బు సేవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీ ట్యాక్స్ బిల్ తగ్గించే ఛాన్స్ వచ్చింది… మిస్ అయితే మళ్ళీ వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాలి.