ఏప్రిల్ 1, 2025 నుండి కొత్త ఇన్కమ్ టాక్స్ రెజిమ్‌కు సంబంధించిన నియమాలు అమలులోకి వచ్చాయి. ఫెబ్రవరి 1, 2025న ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ సంవత్సరానికి 12 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని టాక్స్ ఫ్రీ గా ప్రకటించారు. సాలరీ తీసుకునేవారికి సంవత్సరానికి 12.75 లక్షల వరకు టాక్స్ రహితం చేయడంతో కోట్లాది టాక్స్ పేయర్లు సంతోషించారు. కొత్త రీజిమ్‌లో టాక్స్ నిర్మాణం చాలా సులభంగా ఉండడం వల్ల ఇది ఎక్కువ మందికి ఆకర్షణగా మారింది.
కొత్త టాక్స్ రీజిమ్‌లో ప్రధాన మార్పులు:
1. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు (పాత రీజిమ్‌లో 50,000 మాత్రమే).
2. NPSలో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2))పై మాత్రమే డిడక్షన్ లభిస్తుంది.
3. 4 లక్షల వరకు పూర్తి టాక్స్ ఎగ్జెంప్షన్.
టాక్స్ స్లాబ్‌లు (కొత్త రీజిమ్):
4 లక్షల వరకు: 0% టాక్స్, 4-8 లక్షల మధ్య: 5%, 8-12 లక్షల మధ్: 10%, 12-16 లక్షల మధ్య: 15%, 16-20 లక్షల మధ్య: 20%, 20-24 లక్షల మధ్య: 25%, 24 లక్షలకు పైన: 30%
టాక్స్ ఎలా లెక్కించాలో ఉదాహరణ
ఉదాహరణకు, మీ సాలరీ సంవత్సరానికి 20 లక్షలు అనుకుందాం:
1. ముందుగా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసివేయండి. 19.25 లక్షలు టాక్సబుల్ ఆదాయం.
2. మొదటి 4 లక్షలు: 0% టాక్స్.
3. 4-8 లక్షల మధ్య (4 లక్షలు): 5% = 20,000.
4. 8-12 లక్షల మధ్య (4 లక్షలు): 10% = 40,000.
5. 12-16 లక్షల మధ్య (4 లక్షలు): 15% = 60,000.
6. 16-20 లక్షల మధ్య (3.25 లక్షలు): 20% = 65,000.
7. మొత్తం టాక్స్: 1,85,000 + 4% సెస్ (7,400) = 1,92,400.
ఎవరికి ఏ రీజిమ్ బెస్ట్?
పాత రీజిమ్: HRA, LTA, 80C (1.5 లక్షలు), మెడికల్ ఇన్సురెన్స్ వంటి ఎక్కువ డిడక్షన్లు కావాల్సినవారు.
కొత్త రీజిమ్: సింపుల్ టాక్స్ సిస్టమ్, తక్కువ డిడక్షన్లతో సరిపోయేవారు.
ప్రత్యేక సూచన:
12.75 లక్షల వరకు సాలరీ ఉన్నవారికి పూర్తి టాక్స్ ఎగ్జెంప్షన్ (స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత).
NPSలో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 14% వరకు డిడక్టబుల్.
ఇంకా ఆలస్యం చేయకండి… ఈ కొత్త టాక్స్ సదుపాయాలను ఉపయోగించుకుని మీ టాక్స్ బర్న్ను తగ్గించుకోండి.
ఇంకా ఆలస్యం చేయకండి… ఈ కొత్త టాక్స్ సదుపాయాలను ఉపయోగించుకుని మీ టాక్స్ బర్న్ను తగ్గించుకోండి.
టాక్స్ బాధ్యతలు ఇప్పుడు తక్కువ. కొత్త రీజిమ్‌లో మరింత పొదుపు – ఇప్పుడే మారండి.
గమనిక: మరిన్ని వివరాలకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మీ CAని సంప్రదించండి.