పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలితో “ఎదో తినాలి” అంటుంటారు. అలాంటి టైంలో సింపుల్‌గా తయారు చేసుకునే స్నాక్ ఉండాలి కదా! రోటీన్‌గా ఉండే బ్రెడ్‌ని ఒకసారి టవా మసాలా స్నాక్‌గా మార్చి చూడండి, ఇంటిల్లిపాదీ చప్పరిస్తూ తింటారు. తక్కువ టైంలో రెడీ అయ్యే ఈ బ్రెడ్ మసాలా స్నాక్ పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చుతుంది.
ఇది తయారుచేయడానికి మొదట బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర లాంటివి ముందుగా తరగాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె, బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
తర్వాత పచ్చి బఠాణీలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక్క నిమిషం వేయించాలి. తర్వాత టమాటాలు వేసి అవి సాఫ్ట్ అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం, పసుపు, పావ్‌భాజీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. వెజిటబుల్స్‌కు మసాలా కలిసిపోయేలా మగ్గించాలి.
ఆ తర్వాత మూత తీసి కొంచెం నిమ్మరసం వేసి మళ్లీ కలపాలి. చివరగా బ్రెడ్ ముక్కలు వేసి మసాలా మిశ్రమంతో చక్కగా కలపాలి. బ్రెడ్ ముక్కలు మాష్ కాకుండా జాగ్రత్తగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చాలు.. హాట్ హాట్‌గా వడ్డిస్తే పిల్లలు మాత్రం రెగ్యులర్ బ్రెడ్ అడగరేరు!
ఈ “తవా బ్రెడ్ మసాలా” స్నాక్ స్పైసీగా, కమ్మగా, టేస్టీగా ఉండేలా తయారవుతుంది. ఎలాంటి స్పెషల్ పదార్థాలు లేకుండా, ఇంట్లో ఉండే వస్తువులతో తయారవుతుంది. శనివారం, ఆదివారం సాయంత్రాలు ఇంట్లో కుర్చీ వేసుకుని చాయ్‌తో ఈ స్నాక్ ట్రై చేస్తే ఇక మీ ఇల్లు మినీ హోటలే!
పిల్లల లంచ్ బాక్స్‌లో కొత్తగా ఏదైనా పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఐడియా. ఇక నుంచి బ్రెడ్‌ను పాల్లో ముంచి తినడం మానేసి ఇలా మసాలా బ్రెడ్‌గా పెట్టండి.. ఒక్కసారైనా ట్రై చేస్తే తరచూ చెయ్యక తప్పదు!